Categories
Hyderabad Political

వీళ్లను మీరు ఎంతకు కొన్నారు: ఉత్తమ్‌కు కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ముందు.. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డిని, టీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను కాంగ్రెస్ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని ఉత్తమ్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ కాంగ్రెస్‌లో చేరారని, ఆ ఎంపీని ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఉత్తమ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాయకులు పార్టీలు మారడం సర్వ సాధారణం అన్న కేటీఆర్.. పార్టీ మారితే అమ్ముడుపోయినట్టు కాదన్నారు. ఒకటికి రెండుసార్లు ఉత్తమ్ ఆలోచించి మాట్లాడాలని కేటీఆర్ హితవు పలికారు.
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ఆదివాసీల ప్రయోజనం కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావులు..టీఆర్ఎస్ లో చేరుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతమాత్రాన వారిని కొనుగులు చేశామని ఉత్తమ్ అనడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్‌‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారని అందుకే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని కేటీఆర్ చెప్పారు. ఆత్రం సక్కు, రేగ కాంతారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు

ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలను కేటీఆర్ ప్రస్తావించారు. మీకు సన్నిహితుడైన సీఎం చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేను టీడీపీలో చేర్చుకోలేదా? ఆ వ్యవహారం మీకు కొనుగోలు చేసినట్టు అనిపించలేదా? అని ఉత్తమ్‌ను కేటీఆర్ క్వశ్చన్ చేశారు. కొన్నారని, అమ్ముడుపోయారని ఉత్తమ్ అనడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా తన తీర్చు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read : డేటా లీక్ చేయటానికి సిగ్గుండాలి, ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని : కేటీఆర్

Categories
Hyderabad Political

టీ.కాంగ్రెస్‌కు షాక్ : టీఆర్ఎస్‌లోకి రేగా కాంతారావు, ఆత్రం సక్కు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ : శాసన మండలి ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే శాసన సభ సభ్వత్వానికి కూడా రాజీనామా చేస్తామని వారు వెల్లడించారు. మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతామని తెలిపారు. టీఆర్ ఎస్ లో చేరే అంశంపై విధివిధానాలను రూపొందించుకుంటామని చెప్పారు. టీసర్కార్ హయాంలో ఇటీవల జరుగుతున్న అభివృద్ధి పనులు తమను ఆకర్షించాయని తెలిపారు.

మార్చి 12న తెలంగాణ శాసన మండలి ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు కాంగ్రెస్ ను వీడనున్నారని జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశమైంది. మరోవైపు మార్చి 2 శనివారం సీఎం కేసీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలిశారు.