Categories
Crime Telangana

సంగారెడ్డిలో మరో దిశ ఘటన : దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్

కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్నో కఠినమైన చట్టాలు తెచ్చినా..వారు మాత్రం మారడం లేదు. ఒంటరిగా ఉన్న మహిళలు, యువతులపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌..వాణినగర్‌లో ఓ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. షాప్‌కు వచ్చిన బాలికలను కారులో ఎత్తుకెళ్లి అడవిలో దారుణానికి పాల్పడ్డారు. 2 కి.మీటర్ల దూరంలోని పట్టపగలు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు కామాంధులు. బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు 100కు ఫోన్ చేయడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. బాధితురాలి కంప్లయింట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కామాంధులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటన ప్రదేశానికి బాలికను తీసుకెళ్లారు. అక్కడ మద్యం బాటిళ్లు, ఇతర ఆనవాళ్లు కనిపించాయి. వీటిని సేకరించారు పోలీసులు.

అమీన్ పూర్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు 16 సంవత్సరాలున్న కూతురు ఉంది. 2020, జనవరి 23వ తేదీ గురువారం షాప్‌కని బయటకు వచ్చింది. కారులో ఉన్న యువకులు..ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి..బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అ    నంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. మద్యం సేవించి..ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే కామాంధులు పట్టుకుంటామంటున్నారు పోలీసులు. 

Read More : పంతం నీదా..నాదా : శాసన మండలి భవిష్యత్ తేలేది సోమవారం