Categories
National

అడ్డంగా దొరికింది : పిండి ముద్దను పాపాయిలా నమ్మించబోయి

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు సంబంధించిన డబ్బుల కోసం కొంతమంది కక్కుర్తిపడుతుంటారు. అడ్డదారులు తొక్కుతుంటారు. తర్వాత అడ్డంగా బుక్ అవుతుంటారు. తాజాగా ఓ మహిళా ఇలాగే బుక్ అయ్యింది. పిండి ముద్దను బిడ్డలా తయారు చేసి డబ్బులు కొట్టేయాలని అనుకున్న ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. మహిళ చేసిన పనికి విస్తుపోయారు. 

అసలేం జరిగింది :-
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతల కోసం శ్రామిక్ సేవా ప్రసూతి సహాయత యోజనా పేరిట ఓ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. బాలింతలకు రూ. 1400 తక్షణ ఆర్థిక సాయం, ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సాహించేందుకు బాలింతలకు ప్రోత్సాహం కింద రూ. 16 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంటుంది. దీనిని క్యాష్ చేసుకోవాలని కైలారాస్ ప్రాంతానికి చెందిన మహిళ భావించింది. ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. 

అనుకున్నట్లుగా ప్లాన్ అమల్లో పెట్టింది. తనకు బిడ్డ పుట్టిందని..ఓ వస్త్రంలో చుట్టిన దానిని చూపెట్టింది. ఏఎన్ఎమ్, ఆశా సిబ్బందితో కలిసి అంబులెన్స్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకంలో పేరు నమోదు చేయించాలని..కోరింది. బిడ్డకు టీకా వేయాలని, పరీక్షించాలని ఆశా వర్కర్ చెప్పింది. అయితే..బిడ్డను చూపించేందుకు మహిళ నిరాకరించింది. అక్కడి వారితో వాగ్వాదానికి దిగింది.

వైద్యం అందించకపోవడంతో తన బిడ్డ చనిపోయందని ఏడుస్తూ..బట్టలో చుట్టిన దానిని చూపెట్టింది. ఎరుపు రంగులో ఉన్న దానిని చూసి అక్కడున్న వైద్యులకు డౌట్ వచ్చింది. దానిని పరీక్షిస్తే..గోధుమ పిండి ముద్ద అని గుర్తించారు. దీంతో ఆమె ప్లాన్ డిసికొట్టింది. వెంటనే అక్కడి నుంచి వారు పారిపోయారని, ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు ఈ విధంగా వ్యవహరించారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. 

మహిళ చేసిన పనికి షాక్ తిన్నట్లు..బిడ్డను చూడగానే ఎరుపు రంగులో ఉందని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ గుప్తా తెలిపారు. తీరా అది చూసిన తర్వాత పాప కాదు..పిండిముద్ద అని తేలిందన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆశపడి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని వెల్లడించారు. 
Read More :ఆడపిల్ల పుట్టిందని ట్రిపుల్ తలాక్