Categories
Crime Telangana

మున్సిపల్ సిబ్బందిపై దాడిచేసిన 8 మంది అరెస్టు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయాల మార్కెట్ లో మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది.

గురువారం (ఏప్రిల్ 18, 2019)న రోడ్డుపై వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తుండగా వివాదం నెలకొంది. రోడ్డుపై కూరగాయలు విక్రయించే వ్యాపారులు మార్కెట్ యార్డులో విక్రయించాలని మున్సిపల్ కమిషనర్ పలుమార్లు సూచించినా పట్టించుకోలేదు. రోడ్డుపై ఉన్న కూరగాయల బుట్టలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. దీంతో ఆగ్రహించిన కొంతమంది వ్యాపారులు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేశారు. గాయపడిన వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్లకు వినితి పత్రాలు అందజేశారు. దీనిపై స్పందించిన పోలీసులు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Categories
Uncategorized

ఇనమెట్లలో పోలీసులు హడావిడి : కోడెల కేసులో అరెస్టులు

AP స్పీకర్ కోడెలపై దాడి చేసింది ఎవరు ? వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. డోర్ టు డోర్ జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనితో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఏప్రిల్ 11వ తేదీన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్లలో స్పీకర్ కోడెలపై దాడి జరిగింది. ఆయన పోలింగ్ బూత్‌కు చేరుకోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దాడికి దిగారు. కోడెల కారును తరిమారు. దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. కోడెల దుస్తులు చిరిగిపోయాయి. ఆయనతో పాటు డ్రైవర్‌కి గాయాలయ్యాయి. 

దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి సంబంధించిన వీడియోలను పరిశీలించారు పోలీసులు. సత్తెనపల్లి డివిజన్ నుండి 50 మంది పోలీసుల బృందం శనివారం ఇనుమెట్లకు చేరుకుంది. దాడి చేసింది ఎవరనేది గుర్తించేందుకు జల్లెడ పడుతున్నారు. గ్రామం నుండి ఎవరినీ బయటకు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గుంపులుగా ఉండడంతో వారిని గుర్తించేందుకు పోలీసులకు కష్టసాధ్యమౌతోంది పోలీసులకు. 

Categories
Uncategorized

జగన్ కత్తి కేసు : విశాఖకు ఎన్ఐఏ ఆఫీసర్స్

విశాఖపట్టణం : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కత్తి కేసులో ఎన్ఐఏకి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని విశాఖ పోలీసులను కోరితే…ఇవ్వం…ప్రభుత్వ అనుమతితోనే ఇస్తామని తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ డీజీపిని కలువాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించుకున్నారు. కేసుకు సంబంధించిన విషయంలో సహకరించాలని వారు కోరనున్నట్లు తెలుస్తోంది. 
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వీవీఐపీ లాంజ్‌లో 2018, అక్టోబరు 25వ తేదీన జగన్‌పై దాడి జరిగింది. ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ – ఏపీ టీడీపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ కేసును ఎన్.ఐ.ఏకు అప్పగించాలని వైఎస్ఆర్ నేతలు గతంలోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జనవరి 04 శుక్రవారం హైకోర్టు ఎన్ఐఏకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎవరు ? ఇతని చరిత్ర ఏంటీ ? దాడికి ఎందుకు పాల్పడ్డాడు ? ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే దానిపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. అయితే..ఇక్కడ ప్రభుత్వం ఎన్ఐఏకి సహకరిస్తుందా ? వివరాలు సమర్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి.