Categories
Hyderabad

క్రిటికల్ కండీషన్ : కంట్రోల్ కాని మధులిక బీపీ లెవెల్స్

హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక యశోద ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా

హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పైనే ఇంకా చికిత్స అందిస్తున్నారు. మధులిక బీపీ లెవెల్స్ కంట్రోల్ కావడం లేదని వైద్యులు చెప్పారు. ఐదుగురు వైద్యుల బృందం మధులికకు నిరంతరం చికిత్స అందిస్తోంది. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు. ప్రేమోన్మాది దాడిలో మధులికకు 15చోట్ల తీవ్రగాయాలు అయ్యాయి. స్పృహలోకి వచ్చినా గాయాలు మానడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. 2019 ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఉదయం బర్కత్‌పురలో ప్రేమోన్మాది భరత్.. మధులికపై కత్తితో దాడి చేశాడు.

 

భరత్ కొన్నాళ్లుగా ఇంటర్ చదువుతున్న మధులిక వెంటపడుతున్నాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. మధులిక నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. మధులికపై కొబ్బరి బొండాల కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపాలని చూశాడు. ఈ దాడిలో మధులిక తీవ్రంగా గాయపడింది. బాధితురాలని వెంటనే మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. మధులిక ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మధులిక తల, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె శరీరంలో 14 నుంచి 15 చోట్ల కత్తి గాయాలయ్యాయి. బాధితురాలికి ఎడమ చేతి వేలు తెగిపోయింది. న్యూరో, ఆర్థో, జనరల్, ప్లాస్టిక్ సర్జన్ల వైద్యుల బృందం మధులికను పర్యవేక్షిస్తోంది. ప్రేమ పేరుతో ఉన్మాదానికి పాల్పడిన భరత్‌ను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.