Categories
Uncategorized

ప్రైవేటు సిబ్బందిపై చెప్పుతో దాడి చేసిన ఆర్టీసీ కార్మికురాలు

ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ  డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆర్టీసీ సిబ్బందితో బస్సులను నడిపేందుకు యత్నిస్తోంది. దీంట్లో భాగంగా యాదగిరి గుట్ట డిపో దగ్గర ప్రైవేటు ఆర్టీసీ సిబ్బందితో నడుపుతున్న బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. 

ప్రైవేటు సిబ్బందికి సెక్యూరిటీగా ఉన్న పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రైవేటు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు వాగ్వాదానికి దిగారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చేలా చేస్తున్నారనీ ఇది అన్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా సమ్మెను నిర్వీర్యంచేసేందుకు  ప్రైవేటు వ్యక్తులకు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారనీ దీన్ని సాగనిచ్చేది లేదనీ…బస్సులను నడవనీయమని  ఆగ్రహం వ్యక్తం చేస్తు ప్రైవేటు సిబ్బందిపై ఓ మహిళా కార్మికురాలు చెప్పుతో దాడికి దిగింది. 

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ  సమ్మెతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల్లోని 650 బస్సులు డిపోలీకే పరిమితమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో 670 బస్సులు..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 9 డిపోల్లోను బస్సులు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని 10 డిపోల్లోను..నల్లగొండ జిల్లాలోని 7 డిపోలో 650 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 601 బస్సులతో పాటు  యాదగిరి గుట్టలోని 108 బస్సులు, మంచిర్యాల జిల్లాతో పాటు రాష్ట్రా వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలోను బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.