Categories
Telangana

పోలీసుల పైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత కోసం ఖాకీల వేట

వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీహిల్స్ పోలీసు బృందం ఏపీలోని విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో విల్లా యజమానిపై దౌర్జన్యం వివాదంతో పాటు విచారణకు వెళ్లిన పోలీసులపైకి పెంపుడు కుక్కలను ఉసిగొల్పిన విషయంలో పీవీపీపై 2 కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Ysrcp Leader PVP leaves dogs on Police, before giving notices not him

పీవీపీపై రెండు కేసులు:
పీవీపీపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఒక విల్లా విషయంలో దాడి చేశారని పీవీపీ పై ఒక కేసు నమోదు కాగా, నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పారని మరో కేసు నమోదైంది. ఇటీవల 108 ప్రారంభోత్సవంలో పీవీపీ పాల్గొనడంతో ఆయన బెజవాడలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

విల్లా యజమానిపై దాడి:
కొన్ని రోజులక్రితం పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కైలాష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి భాగంలో నిర్మిస్తున్న రూఫ్ గార్డెన్‌ను అడ్డుకున్నారని, పీవీపీ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని కైలాష్ తన ఫిర్యాదులో తెలిపాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. ఈ హఠాత్పరిణామంతో భయపడ్డ పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు.

Read:అంబులెన్సులు ఆరంభించడం అభినందనీయం…వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Categories
Andrapradesh

నెల్లూరు టూరిజం ఆఫీసులో వికలాంగ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి..జుట్టుపట్టుకుని ఈడ్చి పడేసి దాడి

ఏపీలోని నెల్లూరు జిల్లా టూరిజం కార్యాలయంలో దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగినిపై మేనేజన్ దాడికిపాల్పడ్డాడు. వికలాంగురాలని కూడా చూడకుండా ఏకంగా ఈడ్చి ఈడ్చి కొట్టాడు. అక్కడితో ఊరుకోకుండా మారణాయుధంతో దాడికి దిగాడు. కరోనా సమయంలో నిబంధనల మేరకు మాస్క్ పెట్టుకుని ఆఫీసుకు రావాలని సూచించినందుకు వికలాంగ ఉద్యోగినిపై దాడికి తెగబడ్డాడు డిప్యూటీ మేనేజర్.

వివరాల్లోకి వెళితే..నెల్లూరు దర్గా మిట్ట సమీపంలోని ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగినిలు చాలాకాలం నుంచి తీవ్రవేధింపులకు గురవుతున్నారు. కానీ అన్నింటినీ ఓర్చుకుని తమ విధులను నిర్వహిస్తున్నారు మహిళలు. ఈ క్రమంలో దుర్గామిట్ట ప్రాంతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మాస్క్ పెట్టుకోకుండా ఆఫీసుకు రావటమేకాకుండా తోటి ఉద్యోగుల దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నాడు. దీంతో సదరు వికలాంగ ఉద్యోగిని సార్..మాస్క్ పెట్టుకోవాలి కదా..అది అందరికీ మంచిది కదాని ఓ వికలాంగ ఉద్యోగిని సూచించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఆమెపై దాడికి దిగాడు. పనిచేసుకుంటున్న ఆమెను కుర్చీలోంచి ఈడ్చిపడేశాడు. తరువాత పక్క టేబుల్ పై ఉన్న ఓ ఇనుపరాడ్ తో ఇష్టమొచ్చినట్లుగా తీవ్ర దుర్భాషలాడుతు ఇష్టానుసారంగా కొట్టాడు.

గత కొంతకాలం నుంచి టూరిజం శాఖ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాలు మానేయాలని మహిళలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు.డీవీఎం బాబూజీ సైతం తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోవాలని సూచించినందుకు వికలాంగ మహిళా ఉద్యోగిని కుర్చీలోంచి జడపట్టుకుని లాగిపడేశాడు. తరువాత విచక్షణారహితంగా చావగొట్టాడు. గత కొంతకాలం క్రితం వేధింపులు భరించలేక కార్యాలయంలోనే ఓమహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు యత్నించింది. అంటే అక్కడ ఏస్థాయిలో వేధింపులు ఉన్నాయో ఊహించుకోవచ్చు.

కాగా..వికలాంగ ఉద్యోగినిపై దాడికి పాల్పడిన డిప్యూటీ మేనేజర్ పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేయటంతో కేసు నమోదు చేసుకున్న నాలుగవ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read:అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులు.. 1068 కొత్త అంబులెన్సులు ప్రారంభించనున్న సీఎం జగన్

Categories
International National

చైనా ప్ర‌భుత్వం ఆదేశించాకే భారతీయ సైనికులపై దాడి : అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక‌

జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులవగా.. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్ర‌కార‌మే ఆ దేశ సైనికులు భార‌త సైన్యంపై దాడి చేసిన‌ట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.

జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు చనిపోగా.. బండ రాళ్లు, మేకులు ఉన్న‌ ఐర‌న్ రాడ్ల‌తో చైనా సైనికులు భార‌త జ‌వాన్ల‌పై దాడి చేసిన‌ట్లు అమెరికా త‌న రిపోర్ట్‌లో వెల్లడించింది.

ఈ ఘ‌ట‌నకు ముందు చైనా ప్రభుత్వ ఆదేశాలను ఆ దేశ సైన్యం తీసుకున్నట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ చెప్పింది. త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త మ‌రింత తారా స్థాయికి చేరింది. అయితే చైనా ఇచ్చిన ఆదేశాల‌నే ఆ దేశ సైన్యం పాటించిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్ల‌డించింది.

గల్వాన్ వ్యాలీలో జూన్ 15 న జరిగిన ఘర్షణలో భారత సైనికులపై దాడి చేయడానికి చైనా దళాలు రాళ్ళు, ముళ్ల తీగలతో చుట్టబడిన లాఠీలు, ఇనుప రాడ్లు మరియు గోళ్ళతో నిక్షిప్తం చేసిన క్లబ్లను ఉపయోగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Categories
Andhrapradesh Latest Political

మండలిలో ఫొటోలు, దాడులు.. నారా లోకేష్ పై ఫిర్యాదు చేయనున్న వైసీపీ

ఏపీ శాసనమండలిలో మంటలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ

ఏపీ శాసనమండలిలో మంటలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. మండలిలో లోకేష్ ఫొటోలు తీశారని ఆరోపిస్తున్న వైసీపీ… ఎథిక్స్ కమిటీకి ఆయనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ రోజు లేదా రేపు ఫిర్యాదు చేయనుంది. మరోవైపు మంత్రి లోకేష్ తో పాటు మంత్రి వెల్లంపల్లిపై దాడి చేసిన ఎమ్మెల్సీలపైనా ఫిర్యాదు చేయాలని వైసీపీ నిర్ణయించింది. గతంలో ఓసారి ఇలానే మండలిలో ఫొటోలు, వీడియోలు తీశారు నారా లోకేష్. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని లోకేష్ కు చెప్పారు. అయినా లోకేష్ లో మార్పు లేదు. మరోసారి నిబంధనలకు విరుద్ధంగా మండలిలో ఫొటోలు తీసిన లోకేష్ పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని అధికార పార్టీ నిర్ణయించింది.

మండలిలో బాహాబాహీ:
ఇటీవలే శాసన మండలి సమావేశం జరిగింది. మండలిలో చర్చ జరుగుతుండగా లోకేష్ ఫొటోలు తీస్తున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లోకేష్ వైపు వెళ్లారు. ఆ సమయంలో తనపై దాడి జరిగిందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. వెల్లంపల్లిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీలపైనా అధికార పార్టీ నేతలు ఎథిక్స్ కమిటీకి కంప్లయింట్ చేయనున్నారు.

మంత్రిపై దాడి జరిగిందని ఆరోపణ:
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌(2020-21) సమావేశాల్లో భాగంగా జూన్ 17న రెండో రోజు శాసనమండలి సమావేశాల్లో షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సభలో తన్నుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు కొట్టినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఓ వైపు సభ జరుగుతుంటే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా మండలిలో సభ్యుల ఫొటోలు తీస్తున్నారని, దీన్ని ప్రశ్నించేందుకు ముందుకెళ్లిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని, కావాలనే బిల్లులను అడ్డుకున్నారని మండిపడ్డారు.

Read: మాజీమంత్రి గంటా ప్రధాన అనుచరుడు అరెస్ట్

Categories
International Latest National

చైనా ఆదేశాల ప్రకారమే భారత సైనికులపై క్రూర దాడి, అమెరికా ఇంటెలిజెన్స్

తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల

తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే భారత సైనికులపై దాడి చేశారా? దీని వెనుక కుట్ర కోణం ఉందా? అమెరికాతో భారత్ స్నేహంగా ఉండటం చైనాకు నచ్చడం లేదా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు. జూన్ 15న గల్వాన్ లో చైనా-భారత్ సైనికుల మధ్య తీవ్రమైన హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా ఆర్మీకి కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం. 43మందికిపైగా చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. చైనా సైనికులు దొంగ దాడి చేశారు. ముందు మన భూభాగంలోకి చొరబడి టెంట్లు వేశారు. వాటిని తొలిగించేందుకు వెళ్లిన మన సైనికులపై పథకం ప్రకారం రాళ్లు, పదునైన ఆయుధాలు, మేకులు చుట్టిన రాడ్లతో దాడి చేశారు. కొంతమందిని నదిలోకి తోసేశారు. వాళ్లు 300 మంది, మనవాళ్లు 100 మంది. చుట్టూ శత్రు బలగాలు.. అయినా మన సైనికులు భయపడలేదు. సింహాల్లా గర్జించారు. వీరోచితంగా పోరాటం చేశారు. చైనా సైనికులను తీవ్రంగా ప్రతిఘటించారు.

చైనా బలం ఏంటో అమెరికా మిత్ర దేశాలకు చూపించాలని:
జనరల్ జో జోంగి. చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పని చేస్తున్నాడు. ఈ ఆపరేషన్ కు అనుమతి ఇచ్చింది ఆయనే అని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. చైనా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జో ఇదంతా చేశాడట. జో హుకుం మేరకు చైనా సైనికుల మనోళ్లను రెచ్చగొట్టి క్రూరమైన దాడులకు తెగబడ్డారు. అమెరికా దాని మిత్రదేశాలు చైనాని బలహీన దేశంగా చూస్తున్నాయని, మన సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతో జనరల్ జో జోంగి ఈ దాడులకు ఆదేశాలు ఇచ్చారట. చైనాని బలహీనంగా భావిస్తున్న అమెరికా, దాని మిత్రదేశాలకు గట్టి హెచ్చరిక పంపాలనే ఉద్దేశ్యంతో ఈ దాడులకు ఆయన ఆర్డర్ ఇచ్చారని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

భారత్ కు గుణపాఠం నేర్పాలని:
కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికాతో భారత్ సన్నిహితంగా ఉంటోంది. అయితే అమెరికాని శత్రువుగా చూస్తోంది చైనా. ఈ క్రమంలో శత్రువుతో చేతులు కలిపే దేశాలని, సన్నిహితంగా ఉంటున్న దేశాలను కూడా చైనా శత్రువులానే చూస్తోంది. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలని, భారత్ కు ఓ గుణపాఠం నేర్పాలని చైనా ఆర్మీ దాడులకు తెగబడినట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ దాడుల ముఖ్య ఉద్దేశం చైనా బలం ఏంటో భారత్ కు తెలియజేయడమే. మా శత్రువులతో చేతులు కలిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడమే. అమెరికాతో చేతులు కలిపిన ఇండియా, వారు చెప్పినట్టు వింటోంది అనేది చైనా ఆరోపణ. చైనాకు కాంట్రాక్టులు రద్దు చేయడం, వారి ఉత్పత్తులు బాయ్ కాట్ చేయడం, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం… ఇవన్నీ అమెరికా ఆదేశాల మేరకు భారత్ తీసుకుంటోంది అని చైనా విశ్వసిస్తోంది. ఈ క్రమంలో భారత్ పై కోపం పెంచుకున్న చైనా తమ సత్తా ఏంటో చూపించి భయపెట్టాలని భారత్ ఆర్మీపై దాడి చేయించిందని సమాచారం.

Read: సరిహద్దు వివాదం.. భారత్‌పై దూకుడు పెంచిన నేపాల్.. కొత్త పౌరసత్వ చట్టం 

Categories
Health Latest National

Coronavirusలో కొత్త విషయం : మెదడుపై వైరస్ దాడి

కరోనా వైరస్ పై అధ్యయనంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందనే అధ్యయనాలున్నాయి. కానీ తాజాగా మనిషి మెదడుపైనా కరోనా వైరస్ దాడి చేస్తుందనే విషయం కలవరపాటుకు గురి చేస్తోంది. మెదడులోకి కరోనా చేరి శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందని అమెరికాకు చెందిన అధ్యయన సంస్థ ఒకటి వెల్లడించింది.

అమెరికా జరిపిన అధ్యయనంలో : –
కరోనా… ఈ  వైరస్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఈ వైరస్ జరుగుతున్న అధ్యయనాల్లో కొత్త కొత్త విషలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. లేటెస్ట్ గా అమెరికా జరిపిన ఓ అధ్యయనంలో కరోనా వైరస్‌ మానవ మెదడులోకి ప్రవేశించి శ్వాస కేంద్రానికి సోకుతోందని తెలియడంతో కలవరం మొదలైంది! CSIR-IICB శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని ఏసీఎస్‌ కెమికల్‌ న్యూరోసైన్స్‌లో ప్రచురించారు. ఈ మహమ్మారి వైరస్‌ ముక్కు ద్వారానే మస్తిష్కంలోని ఓల్‌ఫ్యాక్టరీ బల్బ్‌కు చేరుతోందని వారు గుర్తించారు.  

మస్తిష్కంలోని మూల కణాలకూ : –
అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. మెదడులోకి ప్రవేశించిన వైరస్ అక్కడి శ్వాస వ్యవస్థ కేంద్రంపై దాడి చేస్తోందని గుర్తించారు. కరోనా సోకిన వారిలో శ్వాసపరమైన ఇబ్బందులకు కూడా ఇదే కారణమని భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన తర్వాత మానవ దేహంలోని ఇతర అంగాలతో పాటు ఊపిరితిత్తులకు వైరస్‌ ఎక్కువ సోకుతుందని ఇప్పటికే నిర్దారణ అయ్యింది. మస్తిష్కంలోని మూల కణాలకూ వైరస్‌ సోకుతుందని ఫలితంగా మరణానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తల బృందం అంచనా వేస్తోంది

మెదడులో ఒకరకమైన ద్రవం : –
మెదడులో ఒకరకమైన ద్రవం ఉంటుంది. అయితే కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి మెదడులో ఈ ద్రవాన్ని పరిశీలిస్తే ఆ వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.. కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన వారి మెదడును పోస్ట్‌మార్టం చేస్తే అక్కడికి వైరస్‌ ఎలా ప్రవేశిస్తుందో, శ్వాస కేంద్రానికి ఎలా వ్యాపిస్తుందో  మరిన్ని వివరాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.  కరోనా వైరస్ మెదడులోని శ్వాసకేంద్రాన్ని విఫలం చేయొచ్చు. ఫలితంగా శ్వాస ఆడకపోవడం, మెదడులోని పీబీసీ మూల కణాలు  నాశనం అవుతాయి’ అని వారు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు.  

వాసన చూసే గుణం : –
కరోనా వైరస్‌ సోకిన వారు వాసన చూసే గుణం కోల్పోయే సంగతి తెలిసిందే. ముక్కులోంచి మెదడుకు వైరస్‌ చేరుకోవడంతోనే ఇలా జరుగుతుందని ‘కింగ్స్‌ కాలేజ్‌ లండన్’‌ శాస్త్రవేత్తలు సైతం భావిస్తున్నారు. కొవిడ్‌-19 రోగుల మరణాలకు ప్రాథమిక లేదా ద్వితీయ కారణం మెదడు కాకపోయినప్పటికీ దానిని పోస్ట్‌మార్టం చేస్తే వైరస్‌ ఎలా ప్రవేశిస్తుందో తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే మెదడులోకి ఏ వైరస్ అయినా అంత ఈజీగా చేరుకోలేదు. కరోనా వైరస్ ఎలా చేరుతుందనే విషయంపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది.

Read: బీకేర్‌ఫుల్ : 40ఏళ్లు దాటినవారిలో కరోనా హైరిస్క్ ఎక్కువ!

Categories
Andhrapradesh Latest Political

టీడీపీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ

విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఎమ్మెల్యేని అడ్డుకుని దాడి:
దాడికి నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వావాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సోమవారం(జూన్ 15,2020) అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే వెలగపూడి వెళ్లారు. అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. అదే సమయంలో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది.

Categories
Latest Telangana

తెలంగాణకు మళ్లీ మిడతల దండు ముప్పు, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణకు మళ్లీ మిడతల దండు ముప్పు పొంచి ఉందా? మిడతల దండు తెలంగాణపై దాడి చేయనుందా? ఏ క్షణమైనా మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించనుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అటు అధికారులను ఇటు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. మిడతలు రాకుండా జాగ్రత్త పడాలన్నారు.

ఆ 8 జిల్లాల అధికారులను అలర్ట్ చేసిన సీఎం:
తెలంగాణలో వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇలాంటి సమయంలో మిడతల దండు దాడి చేసిందంటే చాలా నష్టం జరుగుతుందన్నారు. లేత పంటను మిడతలు పీల్చి పారేస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. సరిహద్దుల్లో ఉన్న 8 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. జూన్ 20 నుంచి జూలై 5 వరకు మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిడతల దండు దక్షిణం వైపు నుంచి వస్తే తెలంగాణకు ముప్పు ఉందన్నారు. తెలంగాణలో మిడతల దండు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

ప్రత్యేక బృందం ఏర్పాటు:
మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్ తదితరులతో కూడిన బృందం ఒకటీ రెండు రోజుల్లో ఆదిలాబాద్ లో పర్యటించనుంది. అక్కడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తుంది. మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తుంది. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే:
మే నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ దగ్గర అజ్ని అనే గ్రామం దగ్గర ప్రస్తుతం మిడతల దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను సీఎం కేసీఆర్ బుధవారం(జూన్ 10,2020) ప్రగతి భవన్ లో సమీక్షించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలింది. 

Categories
Crime Telangana

డాక్టర్ పై కరోనా పేషెంట్ దాడి

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై కరోనా పేషెంట్ దాడి చేశాడు. ఐసీయూలో కూడా పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సడెన్ గా లేచి బాత్ రూమ్ కు వెళ్తున్న సమయంలో కుప్పకూలి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. తనతో పాటు ఉన్న పాజిటివ్ బంధువు ఇంకొకరు సెలైన్ బాటిల్ ఎక్కించే రాడ్ తో జూనియర్ డాక్టర్ పై దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. 

దాడికి నిరసనగా గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. కరోనాతో మృతి చెందిన ఓ రోగి బంధువులు ఐసీయూలో వైద్యుడిపై దాడికి దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ వారు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వైద్యులు ధర్నాకు దిగారు. ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. పోలీసులు కూడా గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో డాక్టర్లపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ఇటువంటి దాడులను ఎట్టి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి గాంధీ ఎమర్జెన్సీ వార్డు బయట ధర్నా చేస్తున్నారు. అయితే వారిని సముదాయించడానికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులందరూ అక్కడ ఉన్నా కూడా దాడులను ఖండిస్తూ ధర్నాకు దిగారు. 

ఎట్టిపరిస్థితుల్లో డీఎమ్ ఈ దిగి రావాలి, తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి డాక్టర్లపై దాడులు చేయడం ఇది మూడోసారని వైద్యులంతా ఆందోళన చేస్తున్నారు. 

 

Categories
Crime Telangana

హైదరాబాద్ లో కత్తులతో పరస్పర దాడి.. ఇద్దరు రౌడీ షీటర్ల హత్య

హైదరాబాద్ లో మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలివ్ ఆస్పత్రి వద్ద రౌడీ షీటర్లు చాందీ, అబూ గొడవ పడ్డారు. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. 

వెస్టు జోన్ లోని లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై రౌడీ షీటర్ల గ్యాంగ్ లు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. మహ్మద్ చాందీతోపాటు అబూ అనే ఇద్దరు రౌడీ షీటర్లు సంఘటనాస్థలంలో అక్కడికక్కడే మృతి చెందారు. రౌడీ షీటర్ల మధ్య ఆధిపత్యపోరు, పాత కక్షల కారణంగానే పరస్పరం హత మార్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

చాందీ, అబూ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకునేందుకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, లంగర్ హౌజ్ పోలీసులు రంగంలోకి దిగారు. 
Read: తెలంగాణలో తొలిసారిగా స్నేక్‌ రెస్క్యూ సెంటర్‌