tahsildar bunt alive case, accuse surrender

తహశీల్దార్ ను తగలబెట్టిన కేసు : పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తహశీల్దార్ ను హత్య చేశాక నిందితుడు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తహశీల్దార్ ను హత్య చేశాక నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. హత్యకు కారణాలు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగతమైన కారణలా, ఆర్థిక లావాదేవీలా, భూ వివాదాలు కారణమా.. అనే కోణంలో ఎంక్వైరీ జరుపుతున్నారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగుడు.. ఆ తర్వాత తనకు తాను పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి కూడా గాయాలు అయ్యయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయ స్పాట్ లోనే చనిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన ఆఫీస్ లోని ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరు. తహశీల్దార్ ఆఫీస్ లోనే ఈ ఘాతుకం జరిగింది.

తహశీల్దార్ సజీవ దహనం ఘటన కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్త చేపట్టారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

అబ్దుల్లాపూర్ మెట్ లోని తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఆఫీస్ లోకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒక్కసారిగా ఆమెపై పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో విజయ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. మంటలు శరీరం మొత్తం వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన విజయ.. కారిడార్ లో కుప్పకూలారు. కాసేపటికే చనిపోయారు. తహశీల్దార్ ఆఫీస్ రోడ్డుపైనే ఉంటుంది. ఈ ఘటన ఆఫీస్ సిబ్బందిని, స్థానికులను షాక్ కు గురి చేసింది. తహశీల్దార్ తో మాట్లాడాలి అంటూ లోనికి వచ్చిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Related Posts