Tahsildar murder case  Accused Suresh died today

తహశీల్దార్‌ను హత్య చేసిన రైతు సురేష్ మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ చనిపోయాడు. ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన రైతు సురేష్, ఈ క్రమంలోనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

విజయా రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోగా.. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స అందుకున్న సురేష్ ఇవాళ(07 నవంబర్ 2019) ఉదయం చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

చనిపోక ముందు నిందితుడు సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూపట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని, అయితే ఆమె సహకరించకపోవడంతో ఈ పని చేసినట్లు చెప్పాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకుని సజీవదహనం చేసినట్లు వాంగ్మూలంలో తెలిపాడు. 

విజయారెడ్డి హత్య సమయంలోనే తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గుర్నాథం కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Related Posts