tahsildar murder case, suresh wife reaction

తహశీల్దార్ హత్య కేసు : నా భర్త అమాయకుడు.. పావుగా వాడుకున్నారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశంలోనే సంచలనం రేపింది. దీనిపై తీవ్ర కలకలం రేగింది. భూ వివాదం కారణంగా సురేష్ అనే రైతు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశంలోనే సంచలనం రేపింది. దీనిపై తీవ్ర కలకలం రేగింది. భూ వివాదం కారణంగా సురేష్ అనే రైతు విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. దీని వెనుక సురేష్ మాత్రమే ఉన్నాడా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్ లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నిందితుడు సురేష్ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. భూవివాదం కారణంగానే సురేష్ ఈ హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.

కాగా, సురేష్ కుటుంబసభ్యులు మాత్రం మరోలా వాదిస్తున్నారు. సురేష్ కి ఏమీ తెలియదని చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సురేష్ భార్య లత.. నా భర్త అమాయకుడు అన్నారు. నా భర్తను ఎవరో పావుగా వాడుకుని విజయారెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. రెండు నెలలుగా భూమి పోతుందనే ఆందోళనతో సురేష్ ఉన్నాడని ఆమె తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిజానిజాలు బయటకు తీసుకురావాలని కోరారు. సురేష్ భార్యతో పాటు కుటుంబసభ్యులు సైతం ఇదే విషయం చెబుతున్నారు. ఈ వివాదంతో సురేష్ కి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. సురేష్ హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు.

తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోలు పోసి నిప్పంటించగా… ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన విజయారెడ్డి స్పాట్ లోనే చనిపోయారు. సోమవారం(నవంబర్ 4,2019) మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి ఛాంబర్‌లోనే ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తహశీల్దార్ ను కలిసేందుకు కార్యాలయానికి వచ్చిన సురేష్.. మాట్లాడాలని చెప్పి నేరుగా తహశీల్దార్ ఛాంబర్‌కు వెళ్లాడు.

తలుపులు వేసి విజయపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో సురేష్ తో పాటు తహశీల్దార్ డ్రైవర్, అటెండర్ కి కూడా మంటలు అంటుకుని గాయాలు అయ్యాయి. ఆ తర్వాత చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయాడు. భూ వివాదమే మర్డర్ కి కారణం అని పోలీసుల విచారణలో తేలింది. సురేష్ వెనుక ఎవరెవరు ఉన్నారు అనే యాంగిల్ లోనూ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Related Posts