లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఎక్స్ ట్రాలు కుదరవ్ బాబూ : అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ని తెచ్చుకుని పిచ్చి వేషాలేసి జైల్లో పడ్డాడు

Updated On - 3:12 pm, Tue, 19 January 21

Taiwan student  rented girlfriend Miss Behave : ఇళ్లను అద్దెకిస్తారు. వాహనాలు అద్దెకిస్తారు.భూముల్ని కూడా అద్దెకిస్తారు. కానీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా అద్దెకిస్తారని మీకు తెలుసా? ఏంటీ ‘అద్దెకు గర్ల్ ఫ్రెండా’? అని షాక్ అవుతున్నారా? మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఆమెతో చిలిపి చిలిపి సరదాలు తీర్చుకోవాలనుకుంటున్నారా? సరదాగా గొడవ పడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు ఇచ్చే సౌకర్యం చైనా,జపాన్, తైవాన్ వంటి పలు దేశాల్లో ఉంది.

అలా తైవాన్ లో ఓ కుర్రాడు గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు తెచ్చుకుని ఆమెతో వెర్రి వెర్రి వేషాలేసి జైలు పాలయ్యాడు. మూడు గంటలు గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేద్దామని రెంట్ కుతెచ్చుకుని కానీ హద్దులు దాటాడు. కానీ అటువంటివి రూల్స్ లో లేవని చెప్పినా వినలేదు. వెర్రి వేషాలకు ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. జైలు పాలయ్యాడు.

ప్రేమికులు సరసాలాడుకోవడం మామూలే. గిల్లికజ్జాలు, సరదా సరదా తగవులు..మామూలే. అలా లేకపోతే ప్రేమలో మజాయే ఉండదు. ఇటువంటి విషయాల్లో అబ్బాయిలు ముందుంటారనే చెప్పాలి. కావాలని ప్రేయసితో తగవులాడతారు. బతిమాలించుకోవాలనుకుంటారు. ప్రేయసితో రొమాన్స్ చేయాలని ప్లాన్ వేస్తుంటారు. కానీ అద్దెకు తెచ్చుకున్న ప్రియురాలితో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఇబ్బందుల్లో పడకతప్పదని నిరూపించాడు ఓ తైవాన్ యువకుడు.

తైవాన్ యూనివర్శిటీలో చదువుతున్న చెన్ అనే యువకుడు గర్ల్ ఫ్రెండులను అద్దెకిచ్చే ‘లవ్ యాక్టింగ్-ఎక్స్‌ట్రా’ అనే సంస్థ వద్ద తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకని ప్రేయసిగా అద్దెకు తెచ్చుకున్నాడు. మూడు గంటల సేపు అతనితో గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండటానికి సంస్థకు 7,200 తైవాన్ డాలర్లు అంటే భారత్ కరెన్సీలో రూ.19వేలు చెల్లించాడు. ఈ సందర్భంగా సదరు సంస్థ కొన్ని రూల్స్ కూడా పెట్టింది. ఆ రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలని హెచ్చరించింది కూడా. వాటికి అంగీకరిస్తూ చెన్ సంతకాలు కూడా చేశాడు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లాడు.

సంస్థ రూల్ ప్రకారం.. అతడు తన అద్దె గర్ల్‌ఫ్రెండ్‌ చేయి పట్టుకోవచ్చు,కౌగిలించకోవచ్చు. ఇవన్నీ రూల్స్‌లో నోట్ చేసినట్లుగానే ఉండాలి తప్ప అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఆమెకు ఇష్టమైతే ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఇష్టం లేకపోతే ముద్దు పెట్టుకోవడానికేకాదు..శరీరంపై ఎక్కడిపడితే అక్కడికి చేతులు వేయకూడదు. ఈ నిబంధనలన్నింటికీ ఒప్పుకుని సంతకం కూడా పెట్టి గర్ల్ ఫ్రెండ్ ను కలవటానికి మెయిన్ స్టేషన్ దగ్గరకెళ్లాడు. అక్కడ ఆమెను తీసుకుని ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌కెళ్లాడు. అప్పటివరకు అంతా మాగానే ఉంది.

రెస్టారెంట్ లో లంచ్ చేసి షికారు కోసం ఆమెను డాన్ ఫారెస్ట్‌కు తీసుకెళ్లాడు. అక్కడేవచ్చింది చిక్కంతా. బుద్ది పెడదారి పట్టింది. అసభ్యకరంగా మాట్లాడటం..ఆమెపై అక్కడక్కడా చేతులు వేసి తడమటం మొదలుపెట్టాడు. ‘‘నేను నిన్ను కిడ్నాప్ చేస్తా..ఏమైనా చేస్తా’’ ఏంచేస్తావ్? అంటూ ఆమె శరీరాన్ని తడమడం బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమె తొడలు మీద చేతులు వేయటం.. ఆమె షర్ట్‌ బటన్స్ విప్పి వెర్రివేషాలేశాడు. ఆమె పిరుదులను తాకి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. ఒప్పందంలో పేర్కొన్న అని రూల్స్ బ్రేక్ చేశాడు. దీంతో ఆమె అతడిని శతవిధాలా అడ్డుకుంది. కానీ వినలేదు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమె నిస్సహాయంగా అతను చేసే వెర్రి వేషాల్ని భరించాల్సి వచ్చింది.

అలా వాడి వెర్రి పనులతో లక్కీగా.. మూడు గంటలు గడిచిపోయాయి. చెన్ ఒప్పందం ప్రకారం ఆమెను వదిలిపెట్టాడు. ఆమె డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెన్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆమెకు క్షమాపణలు తెలుపుతూ చెన్‌తో లేఖ రాయించి సంతకం పెట్టించుకున్నారు. తరువాత చెన్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో కోర్టు చెన్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 1,80,00 తైవాన్ డాలర్లు అంటే ఇండియా కరెన్సీ ప్రకారం రూ.4,69,696 జరిమానా విధించింది. దీంతో చెన్ కు చుక్కలు కనిపించాయి. వెర్రి వేషాలకు ఫలితం ఇంత గట్టిగా ఉంటుందా? అనుకుని బిత్తరపోయాడు గురుడు..