లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

వారానికి 3 సార్లు ఆస్పిరిన్ తీసుకుంటే.. బ్రెస్ట్, బ్లాడర్ క్యాన్సర్లతో మరణించే ముప్పు తగ్గిస్తుంది!

Published

on

3 aspirin Protect risk of dying from breast and bladder cancers : ప్రతిరోజు ఆస్పిరిన్ పిల్స్ తీసుకుంటున్నారా? రోజుకు మూడుసార్లు ఆస్పిరిన్ పిల్స్ తీసుకునేవారిలో బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ మరణాల ముప్పు తగ్గుతుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆస్పిరిన్ పిల్ తీసుకున్న మిలియన్ల మంది బ్రిటన్లను గుండె జబ్బుల నుంచి ప్రొటెక్ట్ చేసినట్టు రుజువైందని అధ్యయనం పేర్కొంది. దీన్ని బ్రిటన్లు ‘వండర్‌పిల్’ అని ముద్దుగా పిలుస్తుంటారు.

ఇప్పుడు ఈ ఆస్పిరిన్ పిల్.. కొన్ని ప్రాణాంతక క్యాన్సర్లు అయిన బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ల ముప్పు నుంచి కూడా ప్రొటెక్ట్ చేయగలదని నిరూపించినట్టు రీసెర్చర్లు రివీల్ చేశారు. జనాభా ఆధారిత డేటాతో ఆస్పిరిన్ ఎంతవరకు సమర్థవంతంగా క్యాన్సర్లను నిరోధించగలదో తేలాల్సి ఉందన్నారు. ప్రాథమిక పరిశోధనలో జీర్ణాశయాంతర క్యాన్సర్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు పరిశోధక బృందం పేర్కొంది.

మిలియన్ల మంది ప్రతిరోజు తీసుకునే ఈ పెయిన్ కిల్లర్ ద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుందని, రక్తాన్ని పలచబడేలా చేస్తుందని, తద్వారా రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందని అధ్యయనంలో తేల్చారు. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ పదార్థాలతో బోవెల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలదని రీసెర్చర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 13ఏళ్ల పాటు 65ఏళ్ల వయస్సు ఉన్న 1,40,000 మంది పురుషులు, మహిళలపై క్యాన్సర్ స్ర్కీనింగ్ ట్రయల్ ద్వారా ట్రాక్ చేయడం ద్వారా ఈ ఫలితాలను వెల్లడించినట్టు పేర్కొన్నారు.

యూకేలో ట్రయల్ లో పాల్గొన్న వారికి ఆస్పిరిన్ 75mg డోస్ తీసుకోమని సూచించారు. ఆస్పిరిన్ వాడనివారితో పోలిస్తే.. తీసుకున్నవారిలో 21శాతం నుంచి 25శాతం వరకు క్యాన్సర్లతో మరణించే ముప్పును తగ్గించినట్టు నిర్ధారించారు. బ్రెస్ట్, బ్లాడర్ క్యాన్సర్లపై ఈ ఆస్పిరిన్ డ్రగ్ సమర్థవంతంగా పోరాడగలదని అనేక పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.