‘అంధాదున్’ రీమేక్.. టబు పాత్రలో తమన్నా.. రాధిక క్యారెక్టర్లో నభా నటేష్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Tamannaah and Nabha Natesh in Andhadhun Remake: యంగ్ హీరో నితిన్‌ నటించబోయే తదుపరి చిత్రం ఖరారైంది. హిందీలో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘అంధాదున్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్రలో నితిన్‌ నటించబోతున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై నితిన్ తండ్రి ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, సోదరి నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


నవంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. హిందీలో టబు చేసిన పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై ఇటీవల పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొట్టాయి. లేటెస్ట్‌గా చిత్ర యూనిట్‌ దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. టబు స్థానంలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నారు. కాగా.. రాధికా ఆప్టే స్థానంలో నభా నటేశ్‌ నటిస్తున్నారు.


తమన్నా, నభా లతో నితిన్ మొదటిసారి నటిస్తున్నాడు. ఠాగూర్‌ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి ‘మెలోడి కింగ్’ మణిశర్మ తనయుడు సాగర్‌ మహతి సంగీతం అందించనున్నారు. హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు..


Related Tags :

Related Posts :