Home » గ్లామర్ గ్రాము కూడా తగ్గలేదంటున్న తమన్నా
Published
1 month agoon
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా.. ‘హ్యాపీ డేస్’ తో ఇంట్రడ్యూస్ అయ్యి దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు తెర మీద స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ ఆరంభంలో ఎంత గ్లామర్‌గా ఉందో 30 ప్లస్ అయినప్పటికీ అదే గ్రేస్ మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల కోవిడ్‌కు గురై త్వరగా కోలుకున్న తమన్నా ఆ తర్వాత ఎప్పటిలానే ఫిజిక్‌పై ఫోకస్ పెట్టి ఇంతకుముందున్న ఫిట్నెస్ తిరిగి సాధించింది.
తాజాగా తమన్నా తన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. లైట్ వెయిట్ వర్కవుట్స్ తనకు చాలా బాగా ఉపయోగపడ్డాయని చెబుతూనే.. జిమ్‌లో మరీ ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చాలని చెప్పుకొచ్చింది. నిపుణుల పర్యవేక్షణలో రెండు నెలలపాటు వ్యాయామం చేసి తన ఫిట్ బాడీని తిరిగి పొందానని తెలిపింది. తెలుగులో ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ..