కరోనా బారినపడ్డ మిల్కీబ్యూటీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Tamannaah Tested Corona Positive: కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీని బారిన పడ్డారు.


తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా కరోనా బారినపడ్డారు. హై ఫీవర్‌తో బాధపడుతున్న తమన్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇన్‌ఫెక్షన్‌ స్థాయి ఎంత ఉందనే విషయం ఈరోజు తెలుస్తుంది.


షూటింగ్ కోసం తమన్నా హైదరాబాద్‌కి వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం తమన్నా చేతిలో ఓ వెబ్ సిరీస్‌తో పాటు ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటీమార్’ సినిమాలు ఉన్నాయి. ఇటీవల తమన్నా తల్లిదండ్రులకు కరోనా బారినపడి కోలుకున్నారు. తమన్నా త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.Related Tags :

Related Posts :