Home » క్యాన్సర్తో కమెడీయన్ కన్నుమూత
Published
2 months agoon
By
vamsiక్యాన్సర్తో పోరాడుతూ వైద్యానికి డబ్బుల్లేక ఆర్థిక సాయం కోరుతూ ఇటీవల వార్తల్లో నిలిచిన తమిళ హాస్య నటుడు తావసి కన్నుమూశారు. క్యాన్సర్తో పోరాడి ఓడిన తావసి మదురైలోని హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. తావసి బక్కచిక్కిపోయిన ఆకారం చూసి తమిళ ప్రేక్షకులతో పాటు సినీలోకం కదిలివచ్చి ఆయనకు సాయం చేసేందుకు సిద్ధం అవగా.. ప్రపంచానికి ఆయన విషయం తెలిసిన కొన్ని రోజులకే చనిపోయారు. తమిళంలో 140 సినిమాల్లో పైగా సినిమాల్లో నటించిన తావసి దీన స్థితిలో మరణించారు.
నిజానికి తావసి పరిస్థితి గురించి తెలియడంతో కోలీవుడ్ నటులు విజయ్ సేతుపతి, సూరి, శివకార్తికేయన్, సౌందరరాజా, శింబు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అలాగే, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తావసి వైద్యానికి ఆర్థిక సాయం అందజేయడానికి పూనుకున్నారు. నిజానికి తావసి ఆరోగ్యం బాగోకపోవడంతో డైరెక్టర్ శరవణ శక్తి ఆయన్ని చికిత్స నిమిత్తం డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ దగ్గరకి తీసుకెళ్లారు. తావసికి క్యాన్సర్ అని తేలడంతో అప్పటి నుంచి శరవణన్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. తావసి పరిస్థితి గురించి డాక్టర్ శరవణన్ సైతం సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. తావసి వైద్యానికి తాను కొంత ఆర్థిక సాయం చేశానని.. కోలీవుడ్ హీరోలు ముందుకు రావాలని శరవణన్ కోరారు. కానీ, ఇంతలోనే తావసి కన్నుమూశారు.
తమిళంలోహాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగిన తావసిని కాపాడాలంటూ ‘మా నాన్నను కాపాడండి’ అంటూ ఆయన కుమారుడు అరుముగన్ ఓ వీడియోను విడుదల చేశారు. ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ తదితర సినిమాలు తవసికి గుర్తింపునిచ్చాయి. రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో కూడా తావసి నటించారు.