త‌మిళ‌నాడు సీఎం తల్లి కన్నుమూత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

EDAPPADI PALANISWAMY: త‌మిళ‌నాడు సీఎం య‌డ‌ప్పాడి ప‌ల‌నీస్వామి మాతృమూర్తి థ‌వుసే అమ్మల్‌ (93) మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యసమస్యలో బాధపడుతున్న స్వగృహంలోనే ట్రీట్మెంట్ పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం వెన్నుపూసలో సమస్యతో సేలం సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరింది. మంగళవారం తెలవార్లుజామున ఆమె కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు.అంత్యక్రియలకోసం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన సేలం జిల్లాలోని సిలువంపాలయం గ్రామానికి తరలించారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి పలనీస్వామి తన కార్యక్రమాలు అన్ని రద్దుచేసుకొని ఇప్పటికే చెన్నై నుంచి రోడ్డుమార్గంలో స్వగ్రామానికి చేరుకున్నారు. రాష్ట్ర మంతులు. ఎమ్మెల్యేలు పలువురు ఏఐఏడీఎంకే ముఖ్యనాయకులు అమ్మల్‌ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.సీఎంను పరామర్శించి అమ్మల్‌ మృతికి సంతాపం తెలిపారు. డీఎంకే అధినేత స్టాలిన్,MDMK జనరల్ సెక్రటరీ వైగో,నటుడు రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారు. అమ్మల్‌ మృతికి సంతాపం తెలిపారు. ఉదయం 9:30గంటల సమయంలో థ‌వుసే అమ్మల్‌ అంత్యక్రియలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో క్రౌడింగ్ లేకుండా ఉండేందుకు ఉదయాన్నే అంత్యక్రియలు ముగించినట్లు సమాచారం.

Related Tags :

Related Posts :