లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఏనుగు మృతి..వెక్కివెక్కి ఏడ్చిన ఆఫీసర్, వీడియో వైరల్

Published

on

Goodbye To Elephant : సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని ఈ సమాజంలో ఒక మూగజీవి ప్రాణం పోయిందని ఒక ఆఫీసర్‌ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంప్‌లో ఒక ఏనుగు తీవ్రంగా గాయపడింది. ముదుమలై ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ గాయపడిన ఏనుగును దగ్గరికి తీసుకొని‌ సపర్యలు చేశాడు.

ఎలిఫెంట్‌ క్యాంపులో ఉన్న వైద్యుల చేత దానికి చికిత్స అందించారు. ఏనుగు ప్రాణాలు కాపాడేందుకు సిబ్బంది ఎంతగా శ్రమించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఆ ఏనుగు మరణించడంతో ఖననం చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. లారీలో ఉన్న ఏనుగుకు కడసారి వీడ్కోలు పలికేందుకు దాని దగ్గరకు వెళ్లిన రేంజర్‌ ఆఫీసర్‌కు కన్నీళ్లు ఆగలేదు. దాని తొండాన్ని నిమురుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు.

ఈ వీడియోను భారత అటవీ అధికారి రమేష్ పాండే ట్విటర్‌లో షేర్‌ చేశారు. వెంటనే ఇతర ఐఎఫ్ఎస్‌ ఆఫీసర్లు ట్వీట్‌ చేశారు. ఈ వీడియో పెట్టిన రెండు రోజుల వ్యవధిలో లక్షల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. అన్‌కండీషనల్ లవ్‌ అంటూ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది ఈ వీడియో.