లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ లో ట్విస్ట్ : కోర్టుకు రావాలని నవ దంపతులకు ఆదేశాలు

Published

on

tamilnadu mla love marriage : తమిళనాడు ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యే ప్రభు, నవ వధువు సౌందర్య 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కూతురిని బెదిరించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని.. తన కూతురు సౌందర్యని తనకి అప్పజెప్పాలని తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నవ వధువు తండ్రి స్వామినాథన్ పిటిషన్‌ని విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.సినిమా స్టైల్లో కాలేజ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే అయోమయంలో పడిపోయాడు. తమ కూతురిని కిడ్నాప్ చేసి బెదిరించి అధికారం అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే బలవంతంగా వివాహం చేసుకున్నాడని పెళ్లి కుమార్తె తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. కేసు వివరాలు తెలుసుకున్న హైకోర్టు.. వాదనల అనంతరం పెళ్లి కుమార్తెను తమ ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు అధికార పార్టీ కల్లకూరిచి ఎమ్మెల్యే ప్రభు సౌందర్య అనే కాలేజ్ అమ్మాయిని ప్రేమించాడు. గత సోమవారం తన ఇంట్లోనే సౌందర్య పెళ్లి చేసుకున్నాడు. ఎమ్మెల్యే ప్రభు తల్లిదండ్రులు, సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం సింపుల్ గా జరిగింది.
అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు తమ కుమార్తె సౌందర్యను కిడ్నాప్ చేశాడని, బెదిరించి పెళ్లి చేసుకున్నాడని సౌందర్య తండ్రి చెన్నై హైకోర్టును ఆశ్రయించాడు.తన కుమార్తెను తనకు అప్పగించాలని సౌందర్య తండ్రి న్యాయస్థానాన్ని కోరాడు. వాదనలు విన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పెళ్లి కుమార్తె సౌందర్యను శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే తామిద్దరం ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నామని.. తాను ఎవ్వరినీ కిడ్నాప్ చెయ్యలేదంటున్నాడు ఎమ్మెల్యే ప్రభు. ఇద్దరం ఇష్టపడి తమ కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని ఎమ్మెల్యే ప్రభు చెబుతున్నాడు.కులాలు వేరైనా వాటి గురించి ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నానని.. ప్రభు వివరణ ఇచ్చారు. అయితే హైకోర్టు ముందు పెళ్లి కుమార్తె సౌందర్య ఏం సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *