టీవీ సీరియల్ నటుడు హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

TV serial actor Selvarathinam murder : ప్రముఖ తమిళ టీవీ సీరియల్ థెన్మోజీ బీఏ నటుడు సెల్వరథినం (41) హత్యకు గురయ్యాడు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్ లో ఆదివారం ఆయన హత్యకు గురైనట్లుగా పోలీసులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు సెల్వరథినంను కిడ్నాప్ చేసి చంపేశారు.అసిస్టెంట్ డైరెక్టర్, స్నేహితుడు రవి ఫోన్ కాల్ రావడంతో సెల్వరథినం ఆదివారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. మణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంజీఆర్ నగర్ లో సెల్వరథినం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.సెల్వరథినం గత పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. పలు సినిమా, టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు. టీవీ సీరియల్ థెన్మోజీలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. సెల్వరథినం శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చిన శరణార్ధి. ఆయన భార్య, పిల్లలు దిరూద్ నగర్ లో ఉంటున్నారు.

Related Tags :

Related Posts :