లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

యువతి ప్రాణం తీసిన చీమలు : మంటల్లో సజీవదహనమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Published

on

Tamilanadu chennai woman Attempt to kill ants turns fire died : ఇంట్లో పుట్టలు..పుట్టలు పెట్టిన చీమలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాయి. తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో ఆదివారం (నవంబర్ 22,2020)న జరిగిన ఈ దారుణంపై కుటుంబ సభ్యులంతా కన్నీటి సముద్రంలో మునిగిపోయారు.వివరాల్లోకి వెళితే..చెన్నై అమింజికరైలోని పెరుమాల్ ఆలయం స్ట్రీటు కు చెందిన సత్యమార్తి దంపతులు నివాసముంటున్నారు. వారికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు సంగీత షోలింగనల్లూరులోని ఒక ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొడుకు కాలేజీలో చదువుకుంటున్నాడు.ఈ క్రమంలో వారి ఇంటి నిండా చీమలు పుట్టలు పెట్టాయి. ఇంట్లో ఉండే అన్ని పదార్ధాల్లోను చీమలు పేరుకుపోయి ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కడ చూసినా చీమలు, చీమలు చీమలు. దీంతో సంగీతకు చికాకు వచ్చేసింది. ఎన్నో చీమల మందులు వాడింది. అయినా ఇంట్లో చీమలు తగ్గలేదు. దీంతో ఆమెకు ఇరిటేషన్ కు గురైంది.ఈక్రమంలో సంగీత తల్లి సహాయంతో చీమలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. చీమలు చెల్లాచెదురుగా పారిపోతుంటే సంగీత వాటిపై కూడా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది.ఈ క్రమంలో ఆ మంటలు సంగీత బట్టలకు మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి ఒళ్లంతా పాకాయి.తల్లి కూతురుకి అంటుకున్న బట్టలు ఆర్పటానికి తీవ్రంగా యత్నించింది. కానీ సాధ్యం కాలేదు. మంటల్లో నిలువునా కాలిపోయిన సంగీత తల్లి కళ్లముందే సజీవదహనం అయిపోతుంటే ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. పెద్ద పెద్దగా కేకలు వేసింది. మంటలు ఆర్పటానికి యత్నించింది. ఆమె కేకలకు వేరే గదిలో ఉన్న తండ్రీ సోదరుడు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు.కళ్లముందే కొనఊపిరితో కొట్టుకుంటున్న సంగీతన పొరుగువారి సహాయంతో కిల్ పాక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. కానీ శరీరం చాలా వరకూ కాలిపోవటం చికిత్స పొందుతు ఆదివారం సాయంత్రం సంగీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా కూతుర్ని రక్షించే యత్నంలో సంగీత తల్లికి కూడా చిన్న చిన్న గాయాలవ్వటంతో ఆమె చికిత్సపొందుతోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *