నేరగాళ్ల వేట : మూడు రోజుల్లో 150మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Tamilnadu : తమిళనాడులో చైన్ స్నాచింగ్ లతో పాటు ఇతర చోరీలు చేసిన వారి కోసం పోలీసులు వేట చేపట్టారు. దీంట్లో భాగంగా గత మూడు రోజుల నుంచి 150మందిని అరెస్ట్ చేసి లోపలేశారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు షాపింగ్ హడావిడిలో ఉండగా చోరీలు చేసేవారు వాళ్ల పనిలో వాళ్లు బిజీగా ఉంటారు.అసలే కరోనా కష్టాలు..పైగా చోరీలు. ఈ క్రమంలో చోరీలను అరికట్టాలనే ఉద్ధేశంతో తమిళనాడు పోలీసులు చిన్న చిన్న దొంగల నుంచి పాత నేరస్థులను కూడా పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రత్యేక వేట సాగించిన పోలీసులు..150 మందిని అరెస్ట్ చేశారు.పోలీసులు అరెస్ట్ చేసినవారిలో గతంలో వారెంట్లు జారీ అయి, పరారీలో ఉన్న నేరస్థులు కూడా వీరిలో ఉన్నారని..చెన్నై పోలీసు కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఆయన జారీచేసిన ఉత్తర్వులతో నగర పరిధిలో రౌడీల కోసం ముమ్మరంగా వేటను కొనసాగిస్తున్నామని తెలిపారు.దీంట్లో భాగంగానే..చెన్నై దక్షిణ ప్రాంతంలో 20 మందిని, పశ్చిమ ప్రాంతంలో 12 మందిని అరెస్ట్ చేశామని..బుధవారం (నవంబర్ 11,2020)రాత్రి మరో 33 మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆపై టీ-నగర్ లో 28 మంది, మౌంట్ రోడ్ లో 23 మంది, అడయార్, ట్రిప్లికేన్ ప్రాంతాల్లో 19 మంది, మైలాపూరులో 10 మంది పట్టుబడ్డారని వెల్లడించారు.

Related Tags :

Related Posts :