tamilnadu-neighbours-ask-103-year-old-coronavirus-survivor-to-vacate-home

మానవత్వమా నీవెక్కడ? : కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధురాలికి బెదిరింపులు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

103 ఏళ్ల వయస్సు కరోనా మహమ్మారిని జయించిన వృద్ధురాలిని అభినందించాల్సింది పోయి…బెదిరింపులకు దిగాడు ఇంటి యజమాని. నీకు కరోనా తగ్గిపోయిందని రుజువేంటీ? నువ్వు ఇక్కడే ఉంటే మాకు కూడా కరోనా వస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే నా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఖరాఖండీగా చెప్పేశాడు ఇంటి యజమాని. ప్రపంచాన్నే భయాందోళనకు గురిచేస్తే వికృత విలయతాండవం చేస్తున్న కరోనావంటి బలమైన వైరస్ ను జయించిన ఈ 103 ఏళ్ల బామ్మ తోటి మనుషుల వివక్షను జయించలేక..భరించలేక బిక్కుబిక్కుమంటోంది. ఇంటి యజమానితో పాటు ఇరుగుపొరుగు వాళ్లు ఆమెను బెదిరిస్తున్నారు. ఖాళీ చేయకపోతే పెట్టేబేడా వీధిలో పారేస్తామని భయపెడుతున్నారు. దీంతో ఆమె కన్నీళ్లతో దిక్కుతోచక ఆవేదన చెందుతోంది.

తమిళనాడులోని వెల్లూరుకు చెందిన హమీదా బీ అనే బామ్మ కరోనా బారిన పడి కోలుకుని అంబూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చింది. కరోనా నిబంధనల ప్రకారంగా ఇంటికొచ్చి ఎక్కడా తిరగకుండా జాగ్రత్తగానే ఉంటోంది. ఇంటికే పరిమితమై అత్యంత జాగ్రత్తగా ఉంటోంది. వితంతువైన కూతురు..మనుమరాలితో కలిసి హమీదాబీఉంటోంది. కూతురు..మనుమరాలికి తోడుకు ఆ వయస్సులో కూడా తనకు తోచినపనిచేస్తూంటుంది.

ఈ క్రమంలో కరోనా బారిన పడిన హమీదా చికిత్స తరువాత ఇంటికి వచ్చింది. ఇంటినుంచి బైటకు వెళ్లకుండా బాధ్యతగా ఉంటోంది. కానీ ఆమెను యజమాని రోజూ బెదిరిస్తున్నాడు. మీ వల్ల అందరికీ కరోనా వస్తుంది..ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటున్నాడు. 15 ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంటున్నామని, మొన్నటివరకు పెద్దమ్మా అని ప్రేమగా పిలిచిన వారే ఇప్పుడు నన్ను చూస్తే ఏదో పాపం చుట్టుకుంటుందన్నట్లుగా..నన్ను చూస్తేనే కరోనా వచ్చేస్తుందన్నట్లుగా ఏహ్యభావంతో చూస్తున్నారని హమీదా వాపోతోంది. ఇరుగుపొరుగువారు సూటీ పోటీ మాటలు వింటున్న ఆమె కూతురు కూడా బాధపడుతోంది.

హమీదా వైరస్ నుంచి పూర్తి కోలుకున్నట్లు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లు చూపినా వారు అదే తీరుగా ఉన్నారు. చివరకు సరుకులు కొనుకునేందుకు వెళితే వాళ్లు హమీదా కుటుంబానికి సరుకులు అమ్మేది లేదంటున్న దుస్థితి.ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. ప్రాంతీయ అధికారి గాయత్రి సుబ్రమణి హమీదా ఇంటికి వచ్చి..హమీదాను ఆదుకుంటామని, పెన్షన్‌ మంజూరు చేస్తామని హాహీ ఇచ్చారు.

Related Posts