Home » పందులతో జల్లికట్టు పోటీ..గెలవటం అంత ఈజీ కాదు..
Published
1 month agoon
Tamilnadu : pig taming sport celebrated for pongal : తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు బసవన్నలతో జల్లికట్టు పోటీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కానీ అదే సంక్రాంతి పండుగకు ‘పందులతో జల్లికట్టు’ పోటీలు గురించి విన్నారా? అంటే లేదని చెబుతాం. కానీ పందులతో కూడా పోటీలు పెట్టే ఓ గ్రామం ఉంది తమిళనాడులో. సంక్రాంతి పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఎద్దులతో జల్లికట్టు పోటీలు జరుగుతుండగా..తేని జిల్లా అల్లినగరం ప్రాంతంలో మాత్రం ‘పందుల జల్లికట్టు’ పోటీలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ పందులతో జల్లికట్టు పోటీలు ఎద్దుల పోటీలతో పోలిక కాదు. అది వారు సరదాగా చేసుకునేది.
ఈ పందుల జల్లికట్టు చూడటానికి ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వచ్చి ఆసక్తిగా తిలకించారు. వల్లినగర్ ప్రాంతంలో కురువర్ వర్గానికి చెందిన 50కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా వన వేంగైగళ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పందుల జల్లికట్టు కొన్ని రూల్స్ ప్రకారం నిర్వహించారు.
ఈ పోటీల్లో పాల్గొనే పందులు 70 నుంచి 100 కిలోల బరువు ఉండాలి. పోటీలో పాల్గొనే ముందు వాటి బరువును చూసిన తరువాతే పాల్గొనేలా చేస్తారు. ఆ పందులకు తాటి మానులతో ఏర్పాటు చేసిన వడివాసన్ నుంచి పంది మూడడుగుల దూరం వెళ్లిన తర్వాతే దానిని పట్టుకోవాలి. అది రెండవ నిబంధన.
అలా చివరి లైన్ దాటేలోపు కేవలం పంది వెనుక కాళ్లు మాత్రమే పట్టుకొని దానిని ఆపాలి. అలా ఆపిన వారు విజేతలుగా నిలుస్తారు. పందిని పట్టుకోకుండా లైన్ దాటే పందిని విజేతగా ప్రకటిస్తారు. అంటే ఈ పోటీల్లో విజేతలకు అయితే పంది అయినా అవుతుంది. లేదా పందిని ఆపిన మనిషి అయినా విజేత అవుతారన్నమాట.
ఈ సంవత్సరం ఈ పందుల పోటీల్లో పాల్గొందుకు తేని, దిండుగల్, మదురై జిల్లాల నుంచి 12 పందుల రాగా, 45 మంది యువకులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ వింత జల్లికట్టును వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై..యువకులను ఈలలు, చప్పట్లో ఉత్సాహపరిచారు.
కాగా తమిళనాడులోని పలు జిల్లాల్లో పందుల్ని పెంచుకుంటుంటారు. వ్యవసాయానికి సహాయంగా ఎద్దులు రైతులకు ఎలా ఉపయోగపడతాయో..రైతుకు ఆదాయాన్ని సమకూర్చటానికి పందులు అలాగే ఉపయోగపడతాయంటారు ఈ ప్రాంత ప్రజలు. ఎలాగంటే పందుల్ని పెంచటం చాలా ఈజీ అనీ..వాటికి బలమైన ఆహారం అంటూ ప్రత్యేకించి పెట్టనవసరం లేదనీ..పైగా చాలా వేగంగా పెరిగి మంచి బరువుగా తయారవుతాయంటున్నారు.
అలాగే ఒక ఆడపంది ఒకేసారి 10కిపైగా పిల్లల్ని ఈనుతుంది. వాటిని అమ్ముకోవచ్చు..అలాగే పెంచుకోవచ్చని పందుల పెంపకం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని..మాంసం కోసం పందుల్ని అమ్ముకోగా మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు తేని, దిండుగల్, మదురై జిల్లాల ప్రజలు.
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక, 2 కోట్ల విలువైన శంఖు చక్రాలు విరాళం
అసభ్యకర వీడియోతో సినీ నటిని బెదిరిస్తున్న కాలేజీ యజమాని
మూఢ నమ్మకాల పేరుతో కూతుర్ని హత మార్చిన తండ్రి
నాకు అది కావాలి..లేదంటే నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తా…ప్రియురాలిని బెదిరించిన ప్రియుడు
గర్భవతి అని తెలిసినా కోరిక తీర్చమని వేధింపులు…
గిప్ట్ చూసి షాకైన వధూ వరులు, ఏ బహుమతి ఇచ్చారో తెలుసా