క్షమించండి…ఆకలి తీర్చుకోటానికి దొంగతనం చేశాను….చోరీ చేసి లేఖ వదిలి వెళ్లిన దొంగ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

tamilnadu: ఆకలి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఆకలికి తట్టుకోలేని ఒక దొంగతనానికి పూనుకున్నాడు. నేరం నాది కాద ఆకలిద అనే పేరుతో తెలుగులో 70ల్లో ఒక సినిమానే వచ్చింది. దొంగతనం చేసి…ఆ పని తప్పని తెలిసి,యజమానిని క్షమించమని కోరాడు ఒక దొంగ.
తమిళనాడు, మధురై లోని పుసలంపట్టి ప్రాంతంలో రాంప్రసాద్ అనే వ్యక్తి సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు. అక్టోబర్ 8వ తేదీ   రాత్రి అతని సూపర్ మార్కెట్ లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో రూ.65 వేలు విలువ చేసే కంప్యూటర్లు, ఒక టీవీ, రూ.5వేల నగదు దుంగుడు ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేసిన వ్యక్తి అక్కడ ఒక లేఖ వదిలేసి వెళ్లాడు.

” చాలా ఆకలి వేస్తోంది. ఈ దొంగతనం వలన మీరు ఒక్కరోజు ఆదాయం కోల్పోతారు..కానీ నాకు అది 3 నెలల ఆదాయంతో సమానం.. క్షమించండి” అంటూ లేఖలో వేడుకున్నాడు.
చోరీ జరిగిన ఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజి, వేలిముద్రల ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.Related Posts