కరోనాను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన మారియమ్మన్ దేవత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు యారియమ్మన్ దేవతను రంగంలోకి దింపారు తమిళనాడులోని ఓ గ్రామ ప్రజలు. అదేంటీ..దేవత ఏంటీ కరోనాను కట్టడి చేయటమేంటీ అను డౌట్ వస్తుంది. అసలు విషయం ఏమిటంటే..

తమిళనాడులో కరోనా కేసుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. మాస్క్ లు పెట్టుకుని పెట్టుకుని విసుగొచ్చేసిన ప్రజలు మాస్క్ లు పెట్టుకోవటానికి చిరాకు పడుతున్నారు.దీంతో మాస్క్ లు లేకుండానే తిరిగేస్తున్నారు. దీంతో కరోనా దాని ప్రతాపాన్ని చూపిస్తోంది. దీన్ని గుర్తించిన పోలీసులు ప్రజలకు వారి వారి నమ్మకాల రూపంలో తెలియజేసి మాస్కులు పెట్టుకునేలా చేయాలని అనుకున్నారు. దీనికో ప్లాన్ కూడా వేశారు.

ఏకంగా తమిళానాడులో చాలా ప్రాంతాల్లో కొలుచుకునే మారియమ్మన్ దేవతను రంగంలోకి దింపారు. ఆమె చేత మాస్కులను పంపిణీ చేయిస్తూ.. వైరస్ ప్రమాదం గురించి ప్రచారం చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తమిళనాడులోని పలు గ్రామాల్లో మారియమ్మన్ దేవతను పూజిస్తారు. ఏవైనా వ్యాధులు వచ్చినా.. అనారోగ్యంగా ఉన్నా నయం చేయాలంటూ మారియమ్మన్ అమ్మను పూజించుకుంటుంటారు. దీంతో కరోనా గురించి ప్రజలను అప్రమత్తం చేయాలంటే ఆ దేవత అయితే బాగుంటుందని పోలీసులు అనుకున్నారు. ఈ ఐడియాతో వారు ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు. మహిళలకు వేషాలు వేయించి మారియమ్మన్ అవతారంలో కరోనా హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోనివారి దగ్గరకు వెళ్లి మాస్కులు పంచిపెడుతూ మాస్క్ లు ఎంత అవసరమోచెప్పిస్తున్నారు.

కరోనా వైరస్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చెబుతున్నారు. పలు గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం మంది ప్రజలు మాస్కులు ధరించడం లేదని తేలింది. దీంతో చాలా ప్రాంతాల్లో యమ ధర్మరాజు, కరోనా వేషధారణలో కూడా ప్రజలకు అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తమిళనాడులో దాదాపు 1,22,350 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1700 మంది చనిపోయారు.

Related Posts