tamilnadu young man held step mother assassinated over illegal affair

పిన్నితో వివాహేతర సంబంధం, వేరొకరితో చనువుగా ఉంటోందని హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కామం కైపెక్కిన యువకుడు వావి వరసలు మర్చిపోయి పిన్ని వరస అయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ఇతడితో కాక వేరోకరితో కూడా చనువుగా ఉంటోందని తెలిసి తట్టుకోలేక పోయాడు. కోపం పట్టలేక పిన్నిని హత్య చేశాడు.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కావేరి పట్ఠణం సమీపంలోని పొత్తాపురమ్‌ మణిమాడి కొట్టాయి ప్రాంతంలో మలర్‌ (38) అనే మహిళ నివసిస్తోంది. భర్త మరణించటంతో ఆమె ఉపాధి కోసం అప్పడాలు తయారు చేసి అమ్ముకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. 3 రోజుల క్రితం ఆమె వ్యాపారం ముంగించుకుని ఇంటికి బయలు దేరింది. కానీ రాత్రి ఎంత సేపైనా ఇంటికి చేరలేదు. దీంతో బంధువులు ఆమె కోసం గాలించారు. ఎక్కడా ఆమె ఆచూకి లభించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శనివారం ఉదయం పొత్తాపురమ్ సమీపంలోని కాలువలో ఓ శవం దొరికింది. అది మలర్ శవంగా బంధువులు గుర్తించారు. కావేరి పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టగా మలర్ కు ఆమె బంధువుల్లో గాంధీ(28) అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. గాంధీని అదుపులోకి తీసుకుని విచారించగా గాంధీ హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు.

“మలర్ నాకు పిన్ని వరస అవుతుంది. ఒంటరిగా ఉన్న ఆమె ఇంటికి తరచూ వెళ్తూ ఉండటంతో ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకునే వాడిని. ఇటీవల ఆమె వేరోకరితో చనువుగా ఉండటం మొదలెట్టింది. ఈక్రమంలో నన్ను పట్టించుకోవటం మానేసింది. ఈ విషయమై మందలించినా వినకుండా అతడితోనే ఎక్కువగా చనువుగా ఉంటోంది. దీనికోసం ఇద్దరిమధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి.”

“3 రోజుల క్రితం షాపు నుంచి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు అడ్డగించాను. అప్పటికే నేను మద్యం సేవించి ఉన్నాను. ఇద్దరి మధ్య వాగ్యుద్దం జరగింది. ఆవేశంలో చేతిలో ఉన్న మద్యం బాటిల్ తో తలపై కోట్టి చంపేసి కాలువలో పడేసి వెళ్లి పోయాను” …అని గాంధీ పోలీసులకు వివరించాడు. గాంధీ పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు.

Read Here >>చాక్లెట్ల ఆశజూపి చిన్నారులపై 15 రోజులుగా లైంగిక దాడి

 

Related Posts