Tamil Nadu father minor 13 years old Daughter suspect human sacrifice

13ఏళ్ల కూతుర్ని నరబలి ఇచ్చిన పన్నీర్ సెల్వం..!తమిళనాడులో దారుణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కష్టపడకుండా సంపద రావాలనే దురాశతో ఓ తండ్రి కన్నకూతుర్ని నరబలి ఇచ్చిన దారుణ ఘటన తమిళనాడు పుదుకోట్టై జిల్లాలోని గంధర్వకోటలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..గంధర్వకోటలో పన్నీర్ సెల్వం తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి కష్టపడకుండానే ధనవంతుడిని అయిపోవాలని కోరిక.దీనికోసం అతను ఓ మంత్రగాడిని కలిసాడు. దానికి అతను కూతుర్ని బలి ఇస్తే ఎంతో ధనవంతుడివి అవుతామని చెప్పాడు. దీనికి పన్నీర్ సెల్వం ఏమాత్రం వెనుకాడలేదు. కూతుర్ని  బలి ఇవ్వటానికి రెడీ అయిపోయాడు. 

అలా అవకాశం కోసం ఎదురుచూస్తుండగా..తన 13 సంవత్సరాల కూతురు నీళ్ల కోసం వెళ్లింది. అదే అదనుగా భావించిన పన్నీర్ సెల్వం ఆ చిన్నారిని యూకలిప్టస్ చెట్ల వద్దకు తీసుకెళ్లి గొంతు కోసం చంపేశాడు. తరువాత ఏమీ తెలియనట్లుగా తన 13ఏళ్ల కూతురు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఈక్రమంలో యూకలిప్టస్ చెట్ల తోపుల్లో ఓ  బాలిక అపస్మాకర స్థితిలో పడి ఉందని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న గంధర్వకోట పోలీసులు పాపను తంజావూరు మెడికల్ కాజేసీ హాస్పిటల్ కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. పాప అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. 

పాప చనిపోయిన విధానంపై అనుమానం వచ్చింది. కానీ నా కూతుర్ని ఎవరో అత్యాచారం చేసి చంపేసి ఉంటారని దొంగ ఏడుపులు ఏడ్చాడు. ఇతలో పోస్ట్ మార్టం రిపోర్టులు కూడా వచ్చాయి. మొదటినుంచి పోలీసులు పన్నీర్ సెల్వంపై అనుమానం ఉండటంతో తమదైన శైలిలో విచారించగా..కూతుర్ని నరబలి ఇచ్చినట్లుగా అంగీకరించాడు. దీంతో పోలీసులు పన్నీర్ సెల్వంతో పాటు అతనికి సలహా ఇచ్చిన మంత్రగాడిగా భావిస్తున్న కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Read: Online classలకు హాజరుకాలేక బాలిక ఆత్మహత్య

Related Posts