tamulnadu father tries to sexually abuse 2 month old girl baby

రెండు నెలల పసిపాపపై తండ్రి అత్యాచార యత్నం: మనిషా..మానవ మృగమా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రెండు నెలల పసిపాపపై కన్నతండ్రే అత్యాచారానికి యత్నించాడు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలోని మాథుర్ గ్రామంలో ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. తన రెండు నెలల పాపపై లైంగిక వేధింపులకు ప్రయత్నించిన 48 ఏళ్ళ వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

పాప నిద్రిస్తున్న సమయంలో తల్లి ఇంటి పనుల్లో ఉండగా..ఈ కామాంధుడు ఆ వ్యక్తి పాపతో పశువులా ప్రవర్తించాడు. పసిగుడ్డును ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించాడు. పాప ఏడుపులు విన్న తల్లి పాల కోసం ఏడుస్తుందేమోనని గబగబా పరుగెత్తుకుంటూ వచ్చింది. కానీ అక్కడ చూసిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది.

 
ఛీ..నువ్వూ ఓ తండ్రివా..అసలు మనిషివా..మానవ మృగానివా..అంటూ తోసిపడేసింది భర్తని. కన్నబిడ్డ..పైగా రెండు నెలల పసిగుడ్డుపై ఇటువంటి దారుణానికి ఒడిగట్టిన నిన్ను విడిచిపెట్టను.. అంటూ ఘొల్లుమంటూ ఏడ్చింది. తన బిడ్డ ఏమైపోతుందననే భయాందోళనలో భర్త అని ఏమాత్రం కనికరించలేదు. వాడొకపశువు అనుకుంది. వెంటనే పోలీసులకు చెప్పింది. బిడ్డను తీసుకుని హాస్పిటల్ కు పరిగెత్తింది.

దీంతో వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి 15 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు పోలీసులు.

Related Posts