లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘ఆచార్య’ సెట్‌లో సోనూ సూద్‌కి సత్కారం

Published

on

Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి పేదలకు, మధ్య తరగతి ప్రజలకు సహాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్‌. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయాన్ని అందిస్తూనే ఉన్నారు.Imageతన వద్దకు వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి, అవసరమైన వారి దగ్గరకు తన టీం ను పంపి ఎంతోమందిని ఆదుకుంటున్నారు సోనూ సూద్‌. సేవా గుణంతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న సోనూ సూద్‌ను ‘ఆచార్య’ సెట్‌లో సీనియర్ నటులు, రచయిత దర్శకులు తనికెళ్ల భరణి, స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ ప్రత్యేకంగా సత్కరించారు.Imageపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా బహుకరించారు. కరోనా సమయంలో వందలాది మందికి చేయూతనందించి సోనూ సూద్‌ స్ఫూర్తినిచ్చారని తనికెళ్ల భరణి ప్రశంసించారు.‘అంటే సుందరానికీ’ ఏమైంది?


ఈ సంద్భంగా సోనూ సూద్‌ మాట్లాడుతూ ముంబై కంటే దక్షిణాది సినిమాల్లో నటించేటప్పుడే తనకు ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుందని, ఇక్కడ ప్రేక్షకులు అందించే ప్రేమను మాటల్లో చెప్పలేనని, అందుకే బాలీవుడ్‌ సినిమాల కంటే దక్షిణాది సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతానని అన్నారు. తర్వాత దర్శకుడు కొరటాల, కెమెరామెన్ తిరులను కూడా శాలువాతో సత్కరించారు తనికెళ్ల భరణి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *