కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న టాటా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మాణ ప్రాజెక్టు టాటాకు దక్కింది. ఈ ప్రాజెక్టు కోసం ఎల్​ అండ్​ టీ లిమెటెడ్​ రూ.865 కోట్లకు బిడ్ దాఖలు చేయగా.. టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ రూ.861.90 కోట్లకు బిడ్​ ను కైవసం చేసుకుంది. 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయానికి ఈ భవనం సిద్ధం చేయాలని కేంద్రం భావిస్తోంది.


కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పార్లమెంటు నూతన భవన నిర్మాణానికి మూడు కంపెనీలు గతనెలలో ఆన్ ​లైన్ బిడ్ల ద్వారా ఎంపికయ్యాయి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) లిమిటెడ్‌, టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, షపూర్‌జీ పల్లాంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు తుది దశ బిడ్డింగ్‌కు అర్హత సాధించాయి. మొత్తం ఏడు కంపెనీలు పార్లమెంటు భవన నిర్మాణంపై ఆసక్తి చూపగా కేంద్ర ప్రజా పనుల విభాగం నాలుగు కంపెనీల దరఖాస్తులను తిరస్కరించింది.2022 నాటికి..పార్లమెంటు, రాష్ట్రపతి భవన్​, మంత్రులు, ఎంపీల నివాసాల కోసం సెంట్రల్​ విస్టా రీడెవలప్​మెంట్ ప్రాజెక్టు చేపట్టింది మోడీ ప్రభుత్వం. దీనికింద దేశరాజధానిలో పార్లమెంటు హౌస్ స్టేట్​లోని 118 ప్లాట్ నంబర్​లో కొత్త భవనాన్ని నిర్మించనుంది.ఈ భవనంలో గ్రౌండ్, బేస్​మెంట్​తో రెండు అంతస్తులు ఉంటాయి.

Related Posts