లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

75శాతం మంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయమన్న TCS కంపెనీ

Published

on

TCS To Allow Work From Home For 75% Employees Even After COVID-19 Lockdown Ends

లాక్ డౌన్ ముగిసిన తర్వాత 75 శాతం మంది తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించిన  TCS కోవిడ్ 19 కేసులు రోజు రోజుకు పెరగటం తప్ప తగ్గటం లేదు.  ఈ  వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో మన దేశంలో కూడా గత నెలరోజులుగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ లాక్ డౌన్ తో దిగ్గజ సంస్ధలు అన్ని కూడా మూతపడ్డాయి. దీంతో చాలా వరకు ఉద్యోగులు అందరు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. లాక్ డౌన్ విధించటానికి ముందు నుంచే కొన్ని కంపెనీలు వర్క ఫ్రమ్ హోం అమలు చేశాయి. 

లాక్ డౌన్ కొనసాగుతునప్పటి నుంచి కంపెనీలన్ని ఉద్యోగులకు వర్క ఫ్రమ్ హోం అమలు చేసింది. భారత దేశపు అతి పెద్ద ఐటీ దిగ్గజ సంస్ధ  TCS ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈవో రాజేష్ గోపినాథన్ తెలిపారు. అంతేకాకుండా 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

టీసిఎస్ సంస్ధ సిఈవో రాజేష్ గోపినాథన్ మాట్లాడుతూ, ఈ లాక్ డౌన్ అనేది మా ప్రస్తుత ఆపరేటింగ్ మోడల్ 20 ఏళ్ల లెగసీ సమయాన్ని కొత్తగా ఆలోచించే విధంగా చేసిందని అన్నారు. 100 శాతం ఉద్యోగులలో 25 శాతం కంటే ఎక్కవ మంది అవసరం లేదని మేము నమ్ముతున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్ధలో 3.5లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

వారిలో సాధారణంగా 20 శాతం మంది ఇంటి నుంచే పని చేస్తుంటారు. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ తో 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులను నిర్వహిస్తున్నారు.  అయితే దీని 2025 లోగా దశల వారీగా 75 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఆ సంస్ధ భావిస్తుంది. ఇలా చేయటం వల్ల ప్రతి ఉద్యోగి ప్రయాణ ఖర్చు పై డబ్బును ఆదా చేయవచ్చు. అంతేకాకుండా టీసీఎస్ కు ఇతర ఖర్చుల నుండి ప్రయోజనం పొందువచ్చు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *