TDP Big Game : Kotla And Sabbam Hari Likely To Join TDP

బిగ్ గేమ్ : టీడీపీలోకి మాజీ ఎంపీలు కోట్ల, సబ్బం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖపట్టణం : జగన్ పాదయాత్ర ముగిసిందో లేదో.. ఏపీ పాలిటిక్స్ భగ్గుమన్నాయి. సంక్రాంతి పండుగను సైతం పక్కనపెట్టి మరీ నేతలు రాజకీయ వ్యూహాల్లో బిజీ అయ్యారు. ఆశావహులకు వల వేస్తూనే.. సీట్ల సర్దుబాట్లపై చర్చలు చేస్తున్నారు.  జిల్లాల్లో పార్టీ బలాబలాలను అంచనా వేస్తున్నారు. అధికార టీడీపీ అయితే ఓ అడుగు ముందుకేసింది. మాజీ ఎంపీలను పార్టీలోకి ఆహ్వానిస్తూ ముందస్తుగానే సీట్లను ఖరారు చేస్తోంది. అందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల  సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
కర్నూలు ఎంపీ స్థానం నుండి కోట్ల ? 
ఈ మాజీ ఎంపీలతో ఇప్పటికే సీఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. టికెట్ విషయంతోపాటు పార్టీలో కీలక పదవులపైనా స్పష్టమైన హామీ తీసుకున్నట్లు ఆయా జిల్లాల్లో ప్రచారం జరుగుతుంది. 2014  ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచింది. 2019 ఎన్నికల క్రమంలో కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. జిల్లాలో మంచి పట్టున్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని  పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన రాకను వ్యతిరేకిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని సైతం ఒప్పించినట్లు తెలుస్తోంది. కోట్ల టీడీపీలో చేరితే కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. టీడీపీ ఆఫర్ పై ఇంకా  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కోట్ల. తనను కేంద్ర మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని గతంలోనే ప్రకటించారు. రాబోయే పదేళ్లలో కాంగ్రెస్ ఏపీ రాష్ట్రంలో బతికిబట్టకట్టే పరిస్థితులు కనబడటం లేదు. అలా అని  రాజకీయంగా కనుమరుగు అయ్యే ప్రమాదాన్ని కూడా కొనితెచ్చుకోలేరు కదా.. అందుకే కాంగ్రెస్ వీడాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా.. ఓ సీఎం కుమారుడి  పార్టీలోకి.. మరో సీఎం కుమారుడు సాధారణ నేతగా కొనసాగటం అంటే కొంచెం కష్టమే. అందుకే టీడీపీలోకి వెళ్లాలని కోట్ల వర్గం నేతలు, అనుచరులు సూర్యప్రకాష్ రెడ్డిని కోరుతున్నారంట. ఈ లెక్కలు, ఇగోలన్నింటినీ దృష్టిలో  పెట్టుకుని వెళితే గిలితే టీడీపీలోకే వెళ్లాలని కూడా కోట్ల భావిస్తున్నట్లు ఆయన వర్గం స్పష్టంగా చెబుతోంది.
మాజీ ఎంపీ సబ్బం హరి…
విశాఖపట్నం జిల్లాకు వస్తే. మరో మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీలో జాయిన్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత పిక్చర్ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబ్బం  హరి.. ఆ తర్వాత పార్టీ వీడారు. జగన్ కు దూరంగా ఉంటున్నారు. టీడీపీని వెనకేసుకొస్తున్నారు. చర్చల్లోనూ అధికార పార్టీ వైఖరినే సమర్ధిస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీలోకి వెళ్లటం ఖాయం అని.. అనకాపల్లి  లేదా మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేయటం ష్యూర్ అంటున్నారు ఆయన అనుచరులు.

READ  వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్లాన్‌.. టీడీపీ‌లో టెన్షన్!

Related Posts