అచ్చెన్న చాలా ధైర్యవంతుడు -బాబు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అక్రమ కేసులకు భయపడి ప్రభుత్వానికి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌ విషయం తెలిసిన వెంటనే తాను చాలా బాధపడ్డానని చంద్రబాబు తెలిపారు.అచ్చెన్న కుటుంబానికి అండగా నిలిచామన్నారు. ప్రజా జీవితంలో పోరాటానికి దిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులైనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రబాబు చెప్పారు. అచ్చెన్న చాలా ధైర్యవంతుడన్న చంద్రబాబు …అతడిని ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఏం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. అచ్చెన్నకు, ఆయన కుటుంబానికి తాను, పార్టీ పూర్తి అండగా ఉంటుందన్న చంద్రబాబు.. మున్ముందు కూడా ఇదే ధైర్యాన్ని కనబరచాలని సూచించారు.

అచ్చెన్నను పరామర్శించిన తర్వాత చంద్రబాబు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రనూ పరామర్శించారు. కొల్లు కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని సూచించారు. హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించారనే విషయం చిన్న పిల్లల్ని అడిగినా చెప్తున్నారని…., అక్రమ కేసు నుంచి సచ్ఛీలుడిగా కొల్లు బయటకు వస్తారన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.ఈఎస్ఐ స్కాం…అచ్చెన్న పాత్ర : 
టీడీపీ ప్రభుత్వం హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడిని ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడిని అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసులు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

బ్యాంకు లూటీలకు యత్నించిన చోర శిఖామణులు


అంతకుముందు ఆయనను రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా, ఖైదీ నంబర్ 1573ని జైలు అధికారులు ఆయనకు కేటాయించారు. ఈ కేసులో ఏ-1గా రమేశ్ కుమార్‌ను చేర్చిన పోలీసులు ఏ-2గా అచ్చెన్నాయుడిని, ఏ-3గా ప్రమోద్ రెడ్డి పేర్లను చేర్చారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఏసీబీ వెల్లడించింది.పోలీసులు అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆయనకు కరోనా సోకింది. కోర్టు ఆదేశాలతో ప్రైవేటు ఆస్పత్రిలో అచ్చెన్నకు ప్రభుత్వం చికిత్స అందిస్తోండగా.. ఈ కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కొల్లు రవీంద్రపై అభియోగాలు : 
వైసీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై అభియోగాలు ఉన్నాయి. పరారీలో ఉన్న కొల్లు రవీంద్రను పోలీసులు తునిలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తుని నుంచి విజయవాడకు తరలించారు.భాస్కర్ రావు హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని తమదైన శైలిలో విచారించారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కర్ రావును చంపినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కొల్లు రవీంద్రపై 302, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవీంద్రకు నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.

READ  మరోసారి చైనా వైరాలజిస్ట్ సంచలన ఆరోపణలు...వూహాన్‌ కరోనాను WHO కవర్ చేసేందుకు ప్రయత్నించింది

Related Posts