లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ గందరగోళం..టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభ నుంచి సస్పెండ్

Published

on

AP assembly MLA Nimmala Ramanayudu suspend : ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ కూడా గందరగోళం నెలకొంది. టిడ్కో ఇళ్లపై చర్చించాలని ప్రతిపక్ష డిమాండ్ చేసింది. టీడీపీ సభ్యులు పోడియం చుట్టిముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పోడియం చుట్టుముట్టడం మీ హక్కా అని ప్రశ్నించారు. మీరు ఇచ్చే చిట్టీలు చదవడానికి కాదని స్పీకర్ ఉందన్నారు. టీడీపీ సభ్యులు సభకు సహకరించాలని చెప్పారు.మాట్లాడమని అవకాశం ఇస్తున్నా వినియోగించుకోవడం లేదన్నారు. సభకు వచ్చేది చర్చ చేయడానికా..పోడియం ముందు గొడవ చేయడానికా అని నిలదీశారు. ఇలా చేస్తే సస్పెండ్ చేయాల్సివస్తుందని హెచ్చరించారు.టీడీపీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. స్పీకర్ వారిని సభ నుంచి వెళ్లిపోవాలన్నారు. టీడీపీ సభ్యులు వినకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *