TDP MLC Yanamala Ramakrishnudu sensational comments on YCP members

వైసీపీ సభ్యుల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు : యనమల 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యుల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు.

వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యుల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి ఓ రిపోర్టు వచ్చిందని…ఆ రోజు సభలో కూడా చదివి వినిపించానని తెలిపారు. వైసీపీ సభ్యుల్లో ఎనబై శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ తోపాటు మరికొన్ని పేపర్లలో వచ్చిందన్నారు. 

అదే విధంగా 60 శాతం కేబినెట్ సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇలాంటి బ్యాంచ్ అంతా అసెంబ్లీలో ఉన్నారని తెలిపారు. అటువంటి బ్యాచ్ అసెంబ్లీలో ఉండటమే కాకుండా వారంతా కూడా శాసన మండలికి వచ్చారని అన్నారు. వైసీపీ మంత్రులు మండలికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

అమరావతి అంటే జగన్ ఎందుకంత అలర్జీ అని అన్నారు. మయి సభ నుంచి దుర్యోదనుడు ఈర్ష్య పడినట్లు…అమారావతిని చూసి జగన్ ఈర్ష్య పడుతున్నట్లు విమర్శించారు. అమరావతిని చూస్తుంటే జగన్ కు చంద్రబాబే గుర్తొస్తున్నారని తెలిపారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపితే ప్రభుత్వానికి అభ్యంతరమేంటన్నారు. 
 

Related Posts