TDP support for Janasena

లాంగ్ మార్చ్ : జనసేన చేసే పోరాటాలకు సపోర్టు – టీడీపీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రజా సమస్యలపై..రాష్ట్రాభివృద్ధికి జనసేన చేసే కార్యక్రమాలకు..పోరాటలకు టీడీపీ సపోర్టు ఉంటుందని..ఆశీర్వాదం ఉంటుందని ప్రకటించారు టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన లాంగ్ మార్చ్‌కు బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని, కార్యక్రమం విజయవంతమైందన్నారు. అందరం కలిసి సమస్యను ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో తాము సంఘీభావం ప్రకటించామని గుర్తు చేశారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖపట్టణంలోని మద్దిలపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించింది. దీనికి టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగసభలో అయ్యన్న పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. 

పార్టీలు పక్కన పెట్టి..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. దేశంలో ఎంతో గౌరవం ఉన్న వ్యవస్థ పోలీసు అని..కానీ ఐదు మాసాల కాలంలో రౌడీ రాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాత్రి 1గంట వరకు స్టేజ్ ఏర్పాటు చేయకుండా జనసైనికులకు అడ్డుపడ్డారని పోలీసు శాఖపై విమర్శించారు. ప్రజాస్వామ్యంలో 
ప్రశ్నిస్తే..పోలీసులు కేసు పెడుతున్నారు..ఇదేమి న్యాయం..దొంగలు రాజ్యమేలుతున్నారు..ప్రజల కోసం పోరాడుతుంటే..కేసులు పెడుతారా ? అంటూ ప్రశ్నించారు. 
ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నారని, లారీ ఇసుక రూ. 50 వేలు ధర పలుకుతోందని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదన్నారు.

ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, బలవన్మరణాలకు పాల్పడుతుంటే..హేళనగా మాట్లాడుతున్నారని తెలిపారు. పవన్ దత్త పుత్రుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారని, జైలులో ఉన్న వ్యక్తి ఏమి తెలుసని..ఒకసారి ఆలోచించి మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు. విశాఖ భూ కుంభకోణంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. మొదటి సిట్‌కు దిక్కులేదు..రెండో సిట్ ఎక్కడా అంటూ విమర్శించారు. దమ్ముంటే..సీబీఐ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల భూములను ఆక్రమించుకున్నారని..దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడూ లేని ఇసుక కొరత ఎందుకు వచ్చిందని..వర్షాకాలంలో ఇసుకను స్టోరేజ్ చేసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. నష్టపోయిన కూలీలకు రూ. 5 వేల నష్టపరిహారం ఇప్పించే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు అయ్యన్న. 
Read More : కర్ణాటకలో కళ్యాణ్‌కు సెక్యురిటీ 900మంది.. జగన్ ప్రభుత్వం మాత్రం డెబ్బై మందిని ఇచ్చింది: నాగబాబు

Related Posts