టీడీపీ కొత్త టీమ్ ప్రకటనకు వేళైందా.. పార్టీ సమూల మార్పుల ప్లానింగ్‌లో లోకేశ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మొన్నటి ఎన్నికల్లో బాగా దెబ్బయిపోయిన తెలుగుదేశం పార్టీ.. ఎలాగైనా బలం పెంచేసుకోవాలని ప్లాన్స్‌ రెడీ చేసుకుంటోందట. యూత్‌ లీడర్‌, పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు లోకేశ్‌ ఈ యాంగిల్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. కొత్త టీమ్‌ను తయారు చేసే విషయంలో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్‌. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న గట్టి పట్టుదలతో ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలుపెట్టారట. యూత్‌ను బాగా యాక్టివ్‌ చేసి క్షేత్రస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టిందని అంటున్నారు.కొంతకాలంగా రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతున్న విషయాన్ని గమనించిన టీడీపీ అధినాయకత్వం… పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలంటే ఏం చేయాలనే దానిపై చాలా సీరియస్‌గా డిస్కషన్స్‌ చేసిందంట. తెలుగుదేశం పార్టీ పెద్దల డిస్కషన్స్‌లో కొన్ని పాయింట్లు తేలాయని అంటున్నారు. ముఖ్యంగా లోకల్‌ లీడర్లను రెడీ చేయాలని డిసైడ్‌ అయ్యారట. స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరుతున్నాయట. అలా చేస్తే ఆ లీడర్లు కూడా మంచి జోష్‌తో పని చేస్తారని భావిస్తున్నారని అంటున్నారు.

అందుకే చంద్రబాబు, లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని పార్టీలో కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ఏపీలో వచ్చే ఏడాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దీంతో టీడీపీ కూడా కొత్త జిల్లాలకు తగ్గట్టుగానే పార్టీ కొత్త టీమ్‌ను రెడీ చేసుకుంటోందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మొత్తంగా 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల విషయంలో కాస్త మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నా… మిగతా జిల్లాల ఏర్పాటు విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.ఈ క్రమంలో కొత్త జిల్లాలకు తగ్గట్టుగా టీడీపీలో కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహించాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే జాబితాను సిద్ధం చేస్తోందని టాక్‌.
టీడీపీ కొత్త టీమ్‌ తయారు చేసే విషయంలో ఆ పార్టీ యువనేత లోకేశ్ కీలకపాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. కొత్త టీమ్‌ ఎంపికలో లోకేశ్ మార్క్ ఉంటుందనే టాక్‌ కూడా టీడీపీలో వినిపిస్తోంది. ఏపీలో కొత్త జిల్లాలపై క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కొత్త టీమ్‌ను ప్రకటిస్తారా? లేక ముందుగానే ప్రకటిస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదని అంటున్నారు. మొత్తానికి ఏపీ టీడీపీలో త్వరలోనే సమూల మార్పులు రావడం ఖాయమని, పార్టీలో కొత్త జోష్‌ వస్తుందని కార్యకర్తలు అనుకుంటున్నారు.

Related Posts