23ఏళ్ల క్రితం స్టూడెంట్‌ను వేధించిన టీచర్ అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

స్టూడెంట్‌ను 23ఏళ్ల క్రితం వేధింపులకు గురి చేసిన టీచర్ ను Arrest చేశారు. 37 సంవత్సరాల మహిళ.. ప్రస్తుతం లాయర్‌గా హాంకాంగ్ లో పేరు తెచ్చుకున్న మహిళ 2019లో ప్రైవేట్ ట్యూటర్ కు వ్యతిరేకంగా కంప్లైంట్ చేసింది. ఆమెకు 14ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు డార్జిలింగ్ లో ఆమె వేధింపులకు గురైందట.

కాగా, అక్టోబరు నెలలో 40ఏళ్ల వయస్సు ఉన్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘సుదీర్ఘ కాలం తర్వాత ఇది చాలా చిన్న విషయం. నిందితుడు అప్పీల్ చేసిన బెయిల్ కూడా రిజక్ట్ అయింది. పోలీసులు అతనిపై స్ట్రాంగ్ కేస్ ఫైల్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని శుక్రవారం మీడియా ముందు వెల్లడించారు.ఈ కంప్లైంట్ చేయడానికి రెండు దశాబ్దాల కాలం ఎందుకు పట్టిందని ప్రశ్నించగా..భయపడ్డానని, అయోమయానికి గురయ్యానని.. అందులో నుంచి సరిపడ జ్ఞానం వచ్చాక లైంగిక వైధింపుల కేసు ఫైల్ చేయగలిగానని వెల్లడించింది. ఇది ఫైల్ చేయడానికి మరో కారణం అతను చిన్నారులను ఇంకా లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు’ అని ఆమె చెప్పింది.

ఆమెకు జరిగిన దాని గురించి చెప్పడానికి ఆ లాయర్ ఇప్పటికీ ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. ‘ఆమెకు ఇబ్బంది అనేది దాదాపు నెల రోజుల పాటు జరిగిందని అప్పటి నుంచి పీడకల లాగా ఆ బాధ వెంటాడుతూనే ఉందని చెప్పారు. డార్జిలింగ్ డిప్యూటీ ఎస్పీ రాహుల్ పాండే పోలీసులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అతనికి వ్యతిరేకంగా కరెక్ట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాతే యాక్షన్ తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు నలుగురు సాక్ష్యులు ముందుకొచ్చారు. కెమిస్ట్రీ టీచింగ్ చేసే వ్యక్తి ఒక స్కూల్ నుంచి మరో స్కూల్ కు మారుతూ ఉండేవాడు. అతను 20ఏళ్ల వయస్సున్నప్పుడు కనీసం ఓ ఐదు స్కూల్స్ మారాడు. అని పోలీస్ అధికారి చెప్పారు. అక్టోబర్ 23వరకూ అతను జ్యూడిషియల్ కస్టడీలో ఉండనున్నాడు. పలు ఐపీసీ సెక్షన్ల ప్రకారం.. అతని పేరిట కేస్ ఫైల్ అయిందని పోలీసులు తెలిపారు.

Related Posts