కార్టున్లు చూపించాడని ఉపాధ్యాయుడి తల నరికాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

teacher killed in france :ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఓ దుండగుడు ఉపాధ్యాయుడి తల నరికేశాడు. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త కార్టున్లను చూపించాడని ఆగ్రహంతో ఈ చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ధుండగుడిని కాల్చి చంపేశారు.
ఉగ్రవాద ఘటనగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అభివర్ణించారు. హింసకు వ్యతిరేకంగా దేశ పౌరులందరూ ఒక్కటవ్వాలని, తీవ్రవాదం ఎప్పటికీ గెలవలేదని దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తెలిపారు. ప్యారిస్ కు 30 కిలో మీటర్ల దూరంలో కాన్‌ఫ్లాన్స్ సౌ హోనోరీ స్కూల్ లో చరిత్ర పాఠాలు బోధించే..ఉపాధ్యాయుడు విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన కార్టున్లు చూపించారని సమాచారం.

ఇద్దరు పేరెంట్స్ కూడా టీచర్ చర్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద కత్తితో వచ్చిన ఒక వ్యక్తి.. ఉపాధ్యాయుడిపై దాడి చేశాడని, నిర్దాక్ష్యిణ్యంగా తలను నరికేశాడని అంటున్నారు. చంపేసిన అనంతరం దుండగుడు పారిపోతుండగా..స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పట్టుకోవడానికి ప్రయత్నించి వెంబడించిన పోలీసులు కాల్పులు జరపడంతో..అతడు చనిపోయాడు. దుండగుడి వయస్సు 18 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. అతను వేసుకున్న డ్రస్ లో బాంబులున్నట్లు అనుమానంతో అధికారులు ఘటనా ప్రాంతాన్ని సీజ్ చేశారు.

మరో ఐదుగురు విద్యార్థులను డిటైన్ చేశారు. టీచర్ పనిచేసే స్కూల్ పేరెంట్స్ తో పాటు కలిపి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మిగిలిన వారిని తదుపరి విచారణ నిమిత్తం ప్రశ్నిస్తున్నారు.


Related Posts