This tech giant makes a case for 4-day working for its employees

పండుగ చేస్కోండి : ఉద్యోగులకు కొత్త రూల్.. వారంలో 4 రోజులే పని

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వారంలో 6 రోజులు ఆఫీసుల్లోనే. ఒకరోజు, లేదంటే రెండు రోజులు వీక్ ఆఫ్. వారంలో వీక్ ఆఫ్ దొరికితే చాలు.. ఎక్కడెక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటారు. పని ఒత్తిడి ఒకవైపు.. ఫ్యామిలీతో కలిసి సరదగా గడిపేందుకు కూడా సమయం దొరకదు. ఐటీ ఉద్యోగులకు మాత్రం వారానికి రెండు రోజులు వీక్ ఆఫ్.. మిగతా ఐదు రోజులు బండెడు చాకిరితోనే ఆఫీసుల్లో గడిపేస్తారు. మళ్లీ వీక్ ఆఫ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూడటం వెరీ కామన్. తెల్లారితే మళ్లీ ఆఫీసు.. ఉరకలు, పరుగుల జీవితం. అబ్బా ఏం లైఫ్ రా బాబూ.. మళ్లీ ఆఫీసుకు వెళ్లాలా? మీ ఆఫీస్ వారానికి 4 రోజులే ఉండి, 3 రోజులు సెలవులు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారా? మీలాంటి ఉద్యోగుల కోసం ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త రూల్ తీసుకొచ్చింది. 

తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల్లోని వేర్వేరు కంపెనీల్లో వర్క్ కల్చర్ విభిన్నంగా ఉంటుంది. అమెరికా, యూరప్ దేశాల్లో అయితే వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలు. ప్రతి కంపెనీ ఇదే వర్క్ కల్చర్ ఫాలో అవుతున్నాయి. దీనికి భిన్నంగా మైక్రోసాఫ్ట్ ప్రయోగత్మకంగా 3 రోజులు వీకాఫ్ ఇచ్చి 4 రోజలు మాత్రమే పనిదినాలుగా ప్రకటించి విజయవంతమైంది. అందిన రిపోర్టు ప్రకారం.. పనిభారం ఎక్కువగా ఉండే జపాన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ ‘వర్క్-లైఫ్ చాయిస్’ పేరుతో ప్రయోగాన్ని నిర్వహించింది. 

ప్రతి ఉద్యోగి తనకు నచ్చిన వర్క్ స్టయిల్ ఎంచుకునేలా ఆఫీసు వాతావరణాన్ని సృష్టించింది. 2019 ఏడాదిలో ఆగస్టులో మైక్రోసాఫ్ట్ కంపెనీ 2వేల మంది ఉద్యోగులకు 5 శుక్రవారాలు వీకాఫ్ ఇచ్చింది. వారి వార్షిక సెలవుల్లో నుంచి ఎలాంటి అదనంగా పనిదినాలు చేయాల్సిన అవసరం లేదని, జీతం కూడా కట్ చేయకుండా మొత్తం జీతాన్ని ఇచ్చింది. ఈ విధానంతో వర్క్ ప్రొడక్షన్ 40శాతం మేర పెరిగినట్టు మరో రిపోర్టు తెలిపింది.

వారానికి 4 రోజుల పనిదినాలు అమలు చేయడంతో అప్పటి నుంచి ఉద్యోగులు తక్కువ సమయంలోనే ఆర్థికపరంగా, ఉన్న సమయంలోనే చురుకుగా పనిపూర్తి చేస్తున్నట్టు గుర్తించింది. అంతేకాదు.. ఒత్తిడి లేకుండా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపింది. సాధారణ పనివేళల్లో ఎక్కువ సమయం మీటింగ్ లు నిర్వహించడానికే సమయం సరిపోయేది. ఇప్పుడు మీటింగ్ లు వదిలేసి కేవలం పనిమీదనే దృష్టిపెడుతున్నారు. బయటకు వెళ్లిరావడం, కాలక్షేపం చేయడం వంటి చేయడం లేదట. అంతేకాదు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు 25.4 శాతం మాత్రమే సమయాన్ని తీసుకుంటున్నారు. 

దీని కారణంగా కంపెనీలో విద్యుత్ వాడకం 23.1శాతానికి తగ్గిపోయింది. తద్వారా కరెంట్ ఆదా అవుతుంది. అలాగే ఉద్యోగులు ఫ్రింట్ చేసే పేజీలు కూడా 58.7శాతానికి తగ్గిపోయినట్టు రిపోర్టు వెల్లడించింది. తక్కువ పనిదినాలు ఉన్న కంపెనీలో ఉద్యోగుల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుందని, ఉత్సాహంగా పనిచేస్తారని మైక్రోసాఫ్ జపాన్ ప్రెసిడెంట్, సీఈఓ టక్యూయా హిరానో చెప్పారు.

READ  హ్యాపీ ఉమెన్స్ డే : మహిళా ఉద్యోగినులకు నేడు సెలవు

20శాతం తక్కువ పనిసమయంలో కూడా అదే ఫలితాన్ని ఎలా సాధించాలని అనేదానిపై ఉద్యోగులు ఆలోచించి అనుభవం పొందేలా చేయాలని కోరుకుంటున్నానని హిరానో తెలిపారు. జపాన్ లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ వారానికి 4 రోజులే పనిదినాలు విధానం కేవలం ప్రయోగత్మకంగానే నిర్వహిస్తోంది. కానీ, ఈ విధానాన్ని జపాన్ లేదా ప్రపంచంలోని ఇతర కంపెనీ బ్రాంచుల్లో కూడా ఫుల్ టైమ్ అమల్లోకి తీసుకొస్తుందా అనేదానిపై క్లారిటీ లేదు.

Related Posts