ఫేస్‌బుక్ నుంచి మెసేంజర్ Kids App.. భారత్ సహా 70 దేశాల్లో రిలీజ్ 

ఫేస్‌బుక్ నుంచి మెసేంజర్ Kids App.. భారత్ సహా 70 దేశాల్లో రిలీజ్ 

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చైల్డ్ ఫ్రెండ్లీ యూజర్ల కోసం కొత్త యాప్ రిలీజ్ చేసింది. అదే… Messenger Kids App. కొత్తగా 70 దేశాలకు ఈ మెసేంజర్ కిడ్స్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో బ్రెజిల్, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలు కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు ఈ మెసేంజర్ కిడ్స్ యాప్ సర్వీసులు అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫేస్ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు.. ఫేస్ బుక్ తమ యూజర్ల కోసం కొత్త ఆప్షన్లను కూడా అందిస్తోంది.

ఈ ఆప్షన్లతో పిల్లల తల్లిదండ్రులకు పేరంట్ కంట్రోల్ అనుమతినిస్తుంది. పిల్లలతో పాటు ఇతర చిన్నారులతో కనెక్ట్ అయ్యేందుకు తల్లిదండ్రులకు ఈ కిడ్స్ యాప్ సహకరిస్తుంది. అలాగే తమ పిల్లలు కిడ్స్ యాప్‌లో కొత్త కాంటాక్టు రిక్వెస్టులు వచ్చినప్పుడు.. ఎవరిని యాక్సెప్ట్ చేయాలి? ఎవరిని రిజెక్ట్ చేయాలో పేరంట్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మెసేంజర్ కిడ్స్ యాప్ లో పేరంట్ Dashboard ద్వారా పేరంట్స్ కాంటాక్ట్ అప్రూవల్స్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫ్రెండింగ్ ఫీచర్ త్వరలో అమెరికాలో ప్రవేశపెట్టనున్నట్టు ఫేస్ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈలోగా ఇతర దేశాల్లో క్రమంగా యాప్ అందుబాటులోకి రానుంది.

మరో రెండో కొత్త ఫీచర్.. పేరంట్స్ తమ పిల్లల టీచర్లు, కోచ్‌లు, ఇతర వ్యక్తులను కనెక్ట్ అయ్యేందుకు అప్రూమ్ చేసే అనుమతి ఉంటుంది. గ్రూపు మెసేంజర్ కిడ్స్ యాప్ లో ఇతర పిల్లలతో కనెక్ట్ అయ్యేందుకు పేరంట్స్ యాక్సస్ ఇవ్వొచ్చు. పిల్లల యాప్ లో కొత్తగా కాంటాక్ట్ యాడ్ అయినప్పుడల్లా పేరంట్స్ కూడా నోటిఫై చేస్తూ అలర్ట్ మెసేజ్ వస్తుంది.

ఈ సూపర్ వైజడ్ ఫ్రెండింగ్ ఫీచర్.. అమెరికాలోకి అందుబాటులోకి వచ్చేసింది. కొత్త స్నేహితులను పొందేందుకు ఫేస్ బుక్ చిన్నారులకు ఆప్షన్లను సులభతరం చేస్తోంది. పిల్లల ప్రొఫైల్ వారి కాంటాక్టులోని స్నేహితులకు కనిపించేలా పేరంట్స్ ఇప్పుడు ఎంపిక చేసుకోవచ్చు. అమెరికా, కెనడా, లాటిన్ అమెరికాలోని తమ పేరంట్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇతర దేశాల్లో ఈ ఫీచర్ వచ్చే కొన్నివారాల్లో రిలీజ్ కానుంది.