Smart Watch:మీ స్మార్ట్‌వాచ్‌లో ‘Hand Wash’ యాప్.. చేతులు కడుక్కోమని మీకు టైమ్ గుర్తు చేస్తుంది!

మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యూజర్లా? మీ వాచ్‌లో Hand Wash అనే కొత్త యాప్ చూశారా? కరోనా సమయంలో చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ యాప్ ఎప్పుడూ మీకు గుర్తు చేస్తుంటుంది.

Smart Watch:మీ స్మార్ట్‌వాచ్‌లో ‘Hand Wash’ యాప్.. చేతులు కడుక్కోమని మీకు టైమ్ గుర్తు చేస్తుంది!

Smart Watch:మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యూజర్లా? మీ వాచ్‌లో Hand Wash అనే కొత్త యాప్ చూశారా? కరోనా సమయంలో చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ యాప్ ఎప్పుడూ మీకు గుర్తు చేస్తుంటుంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి యూజర్లు కాస్త టైమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రిమైండర్‌, టైమర్‌ను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ ధరించేవారు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవచ్చు.

COVID-19 కొత్త కరోనావైరస్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన చర్యలలో కనీసం 20 సెకన్ల పాటు తరచుగా చేతులు కడుక్కోవడం ఒకటి. శాంసంగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు నుంచి ఒక చిన్న బృందం డిజైనర్లు, డెవలపర్లు హ్యాండ్ వాష్ యాప్ రూపొందించారు. WHO ఆదేశాన్ని పాటిస్తూ గెలాక్సీ వాచ్ యూజర్లను సురక్షితంగా ఉంచడంలో సాయపడటమే దీని లక్ష్యం. యాప్ తరచూ ధరించేవారికి చేతులు కడుక్కోవడానికి రిమైండర్‌లను జారీ చేస్తుంది.

ప్రీసెట్ నోటిఫికేషన్‌లతో ఇది ఒక వ్యక్తి అవసరాలు, షెడ్యూల్‌ను బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ చేసి ఎంత సమయం గడిచింది.. వారమంతా టైమర్‌ను ఎన్నిసార్లు ఉపయోగించారో కూడా ఇది యాప్ లో చూడొచ్చు. గెలాక్సీ వాచ్ యూజర్లు తమ చేతులు కడుక్కోవడం ప్రారంభించిన ప్రతిసారీ, యాప్ సమయాన్ని ట్రాక్ చేస్తుంది. 25 సెకన్ల తర్వాత హాప్టిక్ ఫీడ్ బ్యాక్ అందిస్తుంది. WHO సిఫారసు చేసిన 20 సెకన్ల పైన అదనపు 5 సెకన్లు నీటితో కడగడం.. ఆపై చేతులకు సబ్బును ఉపయోగించడం వంటి చేయాల్సిందిగా సూచిస్తుంది.

Clock app of Wear OS కోసం శాంసంగ్ హ్యాండ్ వాష్ యాప్.. గూగుల్ v5.4.0 అప్ డేట్ ఫాలో అవుతుంది. చేతులు కడుక్కోవడానికి పిరియాడిక్ హెచ్చరికలను 40 సెకన్ల ఎక్కువ టైమర్‌ను యాడ్ చేసింది. గూగుల్ వెర్షన్ మాదిరిగా కాకుండా శాంసంగ్ యాప్ గెలాక్సీ స్టోర్ నుండి మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కానీ ఇది స్టాండ్-అలోన్ యాప్ కావడంతో మరిన్ని ఫీచర్లను యాడ్ చేసింది.  హ్యాండ్ వాష్ యాప్‌ను భారతదేశంలో శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది ఇప్పుడు గెలాక్సీ స్టోర్‌లోని అన్ని శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లకు అందుబాటులో ఉంది.

మీ చేతులను శుభ్రం చేసుకోండి :
కరోనావైరస్ నుంచి సురక్షితంగా ఉండటానికి చేతులు కడుక్కోనే ప్రాముఖ్యతను వివరిస్తోంది. Wash Your Lyrics టూల్‌తో సహా, హ్యాపీ బర్త్ డే పాటతో ఇన్ఫోగ్రాఫిక్‌ను క్రియేట్ చేస్తుంది. PathSpot హ్యాండ్ స్కానర్ కూడా ఉంది. 2017లో ఈ స్కానర్ కనిపెట్టారు. దీని ద్వారా ఒక వ్యక్తి చేతిలో ఎంత పరిమాణంలో కలుషితాలు ఉన్నాయో గుర్తించవచ్చు.