2021 మారుతి సుజుకీ కొత్త మోడల్ కారు వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?

2021 మారుతి సుజుకీ కొత్త మోడల్ కారు వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Swift Facelift Launched In India : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. 2021 మారుతీ సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ కారును ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త అప్‌డేట్ వెర్షన్ ధర రూ.5.73 లక్షలుగా (ఎక్స్ షోరూం ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. పాపులర్ హ్యాచ్ బ్యాక్ మిడ్‌లైఫ్ అప్‌డేట్ స్విఫ్ట్ కారు అనేక అత్యాధునిక హంగులతో వచ్చింది. ఇంటీరియర్ డిజైన్, కాస్మిటిక్, సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. విజువల్ అప్ గ్రేడ్స్ తో పాటు కొత్త గ్రిలే, సిల్వర్ ఫినిష్ జోడించారు.

డ్యుయల్ టోన్ ఎక్స్ టీరియర్స్, కాంట్రాస్ట్ రూఫ్ అమర్చారు. ఓల్డర్ మోడల్ కంటే బెటర్ అప్ గ్రేడెడ్ ఆప్షన్లతో ఆకట్టుకుంటోంది. స్విఫ్ట్ మోడల్ 2005లో లాంచ్ అయినప్పటి నుంచి భారత కార్ల మార్కెట్లో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్లలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులతో రిలీజ్ చేస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. కొత్త స్విఫ్ట్ కారులో 10.67 సెం.మీ మల్టీ-ఇన్ఫర్మేషన్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, కొత్త గ్రిల్, మోడల్ కాంట్రాస్ట్ రూఫ్, ‌కొత్త డ్యూయల్-టోన్ ఎక్స్‌టిరియర్‌ లాంటి అప్‌గ్రేడ్స్‌ అందించారు.

రాబోయే కార్ల జనరేషన్ దృష్టిలో పెట్టుకుని మోడ్రాన్ డే కస్టమర్లకు ఫ్యాషన్ కు తగినట్టుగా ఈ కారును డిజైన్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. కొత్త పవర్ ఫుల్ కే-సిరీస్ ఇంజిన్, స్పోర్టయిర్ డ్యుయల్ టన్ ఎక్స్ టీరియర్, బెస్ట్ ఇన్ క్లాస్ ఫ్యూయల్ ఎఫిసియన్సీ, సేఫ్టీ ఫీచర్లను జోడించారు. ఓల్డ్ కారు మాదిరిగానే 1.2 లీటర్ల కే-సిరీస్ మోటార్ అమర్చారు. కొత్త జనరేషన్ 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ వివిటీ పెట్రోల్ ఇంజిన్ ఉంది.

కూల్డ్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీరిక్యులేషన్ (IGR) సిస్టమ్‌తో పాటు కొత్త స్విఫ్ట్‌ తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. కొత్త ఇంజిన్ పవర్ ఔట్ పుట్ 82bhp నుంచి 6000rpm, 113Nm పీక్ టార్క్యూ 4200rpm అందిస్తోంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ISS) టెక్నాలజీతో నెక్ట్స్‌ జనరేషన్‌ కే-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌ అందించినట్టు మారుతి సుజుకి వెల్లడించింది.