Google Chrome Extensions : ఈ 32 గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌తో జాగ్రత్త.. వెరీ డేంజరస్.. మీ డేటా భద్రం.. ఇప్పుడే డిలీట్ చేసేయండి..!

Google Chrome Extensions : ఈ 32 క్రోమ్ ఎక్స్టెన్షన్లలను మీ బ్రౌజర్‌లో వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీరు చూసే ఏదైనా వెబ్‌సైట్‌లో ఆర్బిటరీ కోడ్‌ను ఇంజెక్ట్ చేస్తాయి.

Google Chrome Extensions : ఈ 32 గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌తో జాగ్రత్త.. వెరీ డేంజరస్.. మీ డేటా భద్రం.. ఇప్పుడే డిలీట్ చేసేయండి..!

Google Chrome Extensions, Google Chrome, Google Chrome Users, Google Chrome Security Risks, Chrome Web Store

Google Chrome extensions : మీరు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్లలను వాడుతున్నారా? అయితే ఇప్పుడే మీ బ్రౌజర్ నుంచి డిలీట్ చేసేయండి. లేదంటే మీ విలువైన డేటా హ్యాకర్లకు చేరిపోతుంది. ఈ విషయంలో సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ మొత్తం 32 క్రోమ్ ఎక్స్టెన్షన్లలను తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ అవాస్ట్ (Avast) పరిశోధకుడు వ్లాదిమిర్ పాలంట్ ప్రకారం.. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్లలను చాలా వరకు చట్టబద్ధమైన కార్యాచరణలను అందించాయి.

అయితే, యూజర్లు సందర్శించే ఏదైనా వెబ్‌సైట్‌లోకి ఆర్బిటరీ కోడ్‌ను ఇంజెక్ట్ చేస్తాయి. క్రోమ్ యూజర్లు వెబ్ పేజీలలో యాడ్స్ ద్వారా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని రీసెర్చర్లు పేర్కొన్నారు. ఈ క్రోమ్ ఎక్స్ టెన్షన్లు యూజర్లను ఇతర ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ చేస్తాయని తెలిపారు. అందుకే, వినియోగదారులు ఆయా ఎక్స్‌టెన్షన్లను ఇన్‌స్టాల్ చేసి ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. భద్రతా పరిశోధకులు ఈ 32 ఎక్స్‌టెన్షన్ 7 కోట్ల డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

Read Also : Google Pay UPI Account : గూగుల్ పేలో ఆధార్‌తో ఈజీగా యూపీఐ అకౌంట్ యాక్టివేషన్.. మీ ఫోన్ నెంబర్ ఒకటేనా? చెక్ చేసుకోండి!

క్రోమ్ వెబ్ స్టోర్‌లో 32 డేంజరస్ ఎక్స్‌టెన్షన్లు ఇవే :
ఈ క్రోమ్ ఎక్స్‌టెన్షన్లతో యాడ్‌బ్లాకర్‌లు, డౌన్‌లోడ్‌,లు బ్రౌజర్ థీమ్‌ల నుంచి రికార్డర్‌లు, ట్యాబ్ మేనేజర్‌ల వరకు ఉన్నాయని (Avast) తెలిపింది. ఈ క్రోమ్ ఎక్స్‌టెన్షన్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. గత మేలో PDF టూల్‌బాక్స్ ఎక్స్‌టెన్షన్ ద్వారా అనేక వెబ్‌సైట్‌లలో ఆర్బిటరీ జావాస్ర్కిప్ట్ కోడ్ ఇంజెక్ట్ చేసినట్టుగా గుర్తించారు. క్రోమ్ వెబ్ స్టోర్ (Chrome Web Store) విధానాల ద్వారా బ్యాన్ చేసిన మార్గాల్లో బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ మోనటైజ్ చేయడం ఈ కోడ్ లక్ష్యమని అవాస్ట్ పేర్కొంది.

20కి పైగా క్రోమ్ ఎక్స్ టెన్షన్లలో ఇలాంటి కోడ్‌ను కనుగొన్నారు. క్రోమ్ వెబ్ స్టోర్‌లో 32 హానికరమైన ఎక్స్‌టెన్షన్లు ఉన్నాయని గుర్తించారు. అందులో కొన్ని యూట్యూబ్ ఆటోస్కిప్ (9 మిలియన్లు), సౌండ్‌బూస్ట్ (6.9 మిలియన్లు), క్రిస్టల్ యాడ్ బ్లాక్ (6.8 మిలియన్లు), బ్రిస్క్ VPN (5.6 మిలియన్లు), క్లిప్‌బోర్డ్ హెల్పర్ (3.5 మిలియన్లు), మ్యాక్సీ రిఫ్రెషర్ (3.5 మిలియన్లు) ఉన్నాయి.

Google Chrome Extensions, Google Chrome, Google Chrome Users, Google Chrome Security Risks, Chrome Web Store


Google Chrome Extensions, Google Chrome, Google Chrome Users, Google Chrome Security Risks

ఇలాంటి ఫిష్ డెవలపర్‌ల నుంచి ఎక్స్ టెన్షన్లను డౌన్‌లోడ్ చేయకుండా క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తుంది. క్రోమ్ వెబ్ స్టోర్ వంటి అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నవి కూడా హానికరమైనవి ఉన్నాయి. ఈ ఇలాంటి ఎక్స్ టెన్షన్లను ఇన్‌స్టాల్ చేసే ముందు డెవలపర్‌తో పాటు రివ్యూలను చెక్ చేయండి. అవసరం లేని అనుమతులను అభ్యర్థించే ఎక్స్ టెన్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవాస్ట్ హెచ్చరిస్తోంది. తమ యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌తో మెరుగైన వినియోగదారులకు మరింత భద్రతను అందిస్తుందని భద్రతా పరిశోధకుడు ఒకరు తెలిపారు.

సెర్చ్ పేజీలను రీడైరెక్ట్ చేయడం ద్వారా ఈ ఎక్స్‌టెన్షన్‌లు డబ్బు సంపాదించాయన్నారు. భారత్ వంటి దేశాల్లో, ఆన్‌లైన్ భద్రతా సమస్యల గురించి చాలా మంది వినియోగదారులకు తెలియదు. వాట్సాప్వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా యూజర్లను స్కామ్ చేయడానికి స్కామర్లు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఈ స్కామర్‌లు ప్రధానంగా యూజర్లను సున్నితమైన OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు) షేర్ చేయడానికి లేదా ఫిష్ వెబ్ పేజీలకు లాగిన్ చేసేలా ప్రయత్నిస్తారని హెచ్చరించింది.

Read Also : Maruti Suzuki Jimny Launch : మహీంద్రా థార్‌కు పోటీగా 5 డోర్లతో మారుతీ సుజుకి జిమ్నీ.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?