e commerce : ఆటో రిక్షా సేవలకు 5 శాతం జీఎస్టీ

ఈ - కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆటో రిక్షా సేవలపై జీఎస్టీ (GST) విధించింది. ఇకపై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

e commerce : ఆటో రిక్షా సేవలకు 5 శాతం జీఎస్టీ

Gst Auto

5% GST On Auto Rickshaw Services : ఈ – కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆటో రిక్షా సేవలపై జీఎస్టీ (GST) విధించింది. ఇకపై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉబర్, ఓలా వంటివి ఈ – కామర్స్ (e commerce ) పరిధిలోకి వస్తాయనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆటో బుకింగ్ చేసుకుంటే…జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే వారికి పన్ను భారం పడనుంది.

Read More : Stray Dogs : దేశంలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయో తెలుసా!

అయితే..ఇప్పటికిప్పుడు ఈ ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన 2022, జనవరి 01 అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం…నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ – కామర్స్ ల ద్వారా ఆటో బుకింగ్ లపై జీఎస్టీ మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. సాధారణ ఆటో రిక్షా సేవలకు ఎలాంటి జీఎస్టీ ఉండదని పేర్కొంటోంది.

Read More : Asim Arun : ఇండియా – న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్..చెత్తను క్లీన్ చేసిన ఐపీఎస్

కరోనా కారణంగా..అన్ని రంగాలు అతాలకుతలమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితిలో మార్పులు వస్తుండడంతో రవాణా రంగం మెల్లిమెల్లిగా కోలుకొంటోంది. ఈ – కామర్స్ పరిశ్రమ మార్కెట్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆన్ లైన్ ద్వారా ప్రయాణీకులకు దగ్గరయ్యేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా తక్కువ..అనుకూలంగా బుకింగ్ రైడ్ లు ఇవ్వడంతో చాలామంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు.