5G Phone Battery : మీ 5G ఫోన్‌ బ్యాటరీ వెంటనే ఖాళీ అవుతుందా? ఇప్పుడే 4G నెట్‌వర్క్‌కు ఇలా మారండి..!

5G Phone Battery : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌లను భారత మార్కెట్లో 500 నగరాల్లో విస్తరించాయి. అయినప్పటికీ, కొంతమంది వినియోగదారులు ఈ 5G టెక్నాలజీకి కనెక్ట్ చేసినప్పుడు అధికంగా బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోతుందని అంటున్నారు.

5G Phone Battery : మీ 5G ఫోన్‌ బ్యాటరీ వెంటనే ఖాళీ అవుతుందా? ఇప్పుడే 4G నెట్‌వర్క్‌కు ఇలా మారండి..!

5G draining phone battery_ how to switch from 5G to 4G network on Android and iPhone

5G Phone Battery : మీరు 5G ఫోన్‌ వాడుతున్నారా? మీ ఫోన్ ఛార్జింగ్ వెంటనే ఖాళీ అవుతుందా? మీ ఫోన్ బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతుందని మీకు అనిపిస్తుందా? 5G నెట్‌వర్క్ వినియోగదారులకు మాత్రమే బ్యాటరీ ఛార్జింగ్ సమస్య ఎక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5G కారణంగానే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే.. 5G అనేది అధిక మొత్తంలో విద్యుత్ వినియోగిస్తుంది. తద్వారా డివైజ్ తొందరగా వేడెక్కుతుంది. దాంతో ఫోన్ బ్యాటరీపై ప్రభావం పడి వెంటనే ఛార్జింగ్ దిగిపోతుంది. 4G LTE మాదిరిగా 5G నెట్‌వర్క్ ఉండదు.

అందుకే ఇలాంటి సమస్య ఎదురువుతుందని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికే ఉన్న 4G నెట్‌వర్క్‌పై ఆధారపడే నాన్-స్టాండలోన్ (NSA) 5G నెట్‌వర్క్‌లతో బ్యాటరీ డ్రెయిన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. స్వతంత్ర (SA) 5G నెట్‌వర్క్‌లు 4G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఆధారపడనందున తక్కువ బ్యాటరీని మాత్రమే వినియోగిస్తాయి. NSA 5G సర్వీసులు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తున్నప్పటికీ.. ఫోన్ కాల్‌లు, మెసేజ్‌లు ఇప్పటికీ 4G లేదా 3G నెట్‌వర్క్‌ల ద్వారా మాత్రమే రన్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. రెండు వేర్వేరు నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేసిన రెండు వేర్వేరు డివైజ్‌లను నిరంతరం ఉపయోగించడం వల్ల బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.

Read Also : Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. ఈ రాత్రికే సేల్ ముగుస్తోంది..!

మీరు 5Gకి మారిన తర్వాత 4Gతో బ్యాటరీ లైఫ్ తగ్గుతుందా? అయితే, చింతించకండి. ముఖ్యంగా మీరు ప్రయాణిస్తున్నప్పుడు లేదా మీ డివైజ్ పవర్‌ను సేవ్ చేయాలనుకున్నప్పుడు కొంత బ్యాటరీని ఆదా చేసేందుకు మీరు సులభంగా 4Gకి మారవచ్చు. Android, iPhone రెండింటిలోనూ 5G నుంచి 4G నెట్‌వర్క్‌కి ఇలా ఈజీగా మారవచ్చు. తద్వారా మీ ఫోన్ బ్యాటరీని కొన్నిగంటల పాటు సేవ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌లో 4G నుంచి 5G నెట్‌వర్క్‌కి ఎలా మారాలంటే? :
* మీ Android ఫోన్‌లో ‘Settings’ యాప్‌ను ఓపెన్ చేయండి.
* Settings మెను నుంచి ‘Connections’ ఆపై ‘Mobile Networks’ ఎంచుకోండి.
* ‘Mobile Networks’ మెనులో, ‘Network Mode’ ఎంచుకోండి.
* మీరు వివిధ నెట్‌వర్క్ మోడ్‌ల లిస్టును చూడవచ్చు. ఈ లిస్టు నుంచి ‘LTE/3G/2G (Auto Connect)’ ఎంచుకోండి.

5G draining phone battery_ how to switch from 5G to 4G network on Android and iPhone

5G Phone Battery :  how to switch from 5G to 4G network on Android and iPhone

మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని నిలిపివేయొచ్చు. ఇప్పుడు మీ ఫోన్ 4G LTE లేదా తక్కువ నెట్‌వర్క్‌లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది.

ఐఫోన్‌లో 4G నుంచి 5G నెట్‌వర్క్‌కి ఎలా మారాలంటే? :

* మీ iPhoneలో, ‘Settings’ యాప్‌ను ఓపెన్ చేయండి.
* Settings మెనూ నుంచి ‘Cellular’ ఎంచుకోండి.
* ‘Cellular’ మెనులో, ‘Cellular Data Options’ నొక్కండి.
* ఆ తర్వాత, ‘Voice & Data’ నొక్కండి.
* ఆప్షన్ల లిస్టు నుంచి 5Gని పూర్తిగా నిలిపివేసేందుకు ‘LTE’ని ఎంచుకోండి.

మీకు ‘5G Auto’ని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. బ్యాటరీ జీవితాన్ని సేవ్ చేయాలంటే iPhone అవసరం లేనప్పుడు 5Gని ఆటోమాటిక్‌గా డియాక్టివేట్ చేస్తుంది. iPhone 12 సిరీస్ లేదా ఆపై వెర్షన్ iPhone మోడల్‌లు మాత్రమే 5Gకి సపోర్టు చేస్తాయని గమనించాలి.

Read Also : Whatsapp : ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మీ సింగిల్ వాట్సాప్ అకౌంట్‌ను ఒకేసారి ఎలా వాడాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!