5G Services in India : భారత్‌లో 50 నగరాల్లో 5G సర్వీసులు.. ఏ నెట్‌వర్క్ ఏయే సిటీల్లో ఉందో తెలుసా? ఫుల్ లిస్ట్ మీకోసం..!

5G Services in India : భారత్‌లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసులను పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G కనెక్టివిటీని భారత్ అంతటా వేగంగా విస్తరిస్తోంది.

5G Services in India : భారత్‌లో 50 నగరాల్లో 5G సర్వీసులు.. ఏ నెట్‌వర్క్ ఏయే సిటీల్లో ఉందో తెలుసా? ఫుల్ లిస్ట్ మీకోసం..!

5G Service Available in 50 Indian Cities And Towns _ Check Full List of Cities Here

5G Services in India : భారత్‌లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసులను పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G కనెక్టివిటీని భారత్ అంతటా వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్ 1న 5G సర్వీసులను ప్రారంభించినప్పటి నుంచి టెలికాం ఆపరేటర్లు తమ 5G కవరేజీని 50 భారతీయ నగరాల్లో (డిసెంబర్ 7 వరకు) విస్తరించాయి. దాదాపు ప్రతిరోజూ మరిన్ని నగరాలకు 5G కనెక్టివిటీని అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో, కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ రెండు నెలల వ్యవధిలో 50 భారతీయ నగరాల్లో 5G సర్వీసులను ప్రారంభించినట్లు తెలియజేశారు.

‘టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPs) దేశంలో 01.10.2022 నుంచి 5G సర్వీసులను అందించడం ప్రారంభించాయి. 26.11.2022 నాటికి 50 పట్టణాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని పార్లమెంటులో 5G ప్రారంభంపై ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన చెప్పారు. 5Gపై టారిఫ్‌ల గురించి తెలియజేస్తూ.. టెలికాం ఆపరేటర్లు అదనపు ఖర్చు లేకుండా 5G డివైజ్‌లలో 5G కనెక్టివిటీని అందిస్తున్నారని అశ్విని బదులిచ్చారు. అదనంగా, 5th-జనరేషన్ కనెక్టివిటీ తదుపరి ప్రారంభం.. టెల్కోస్ ద్వారా టెక్నాలజీ మార్కెట్ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద భారతీయ నగరాల్లో 5G అందుబాటులో ఉన్న నగరాల ఫుల్ లిస్టు మీకోసం అందిస్తున్నాం. అందులో మీ నగరం ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి..

Airtel 5G నగరాల జాబితా ఇదే :
Airtel 5G సర్వీసులు ప్రస్తుతం 12 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

Read Also :  Airtel 5G Services : జియో 5G మాదిరిగానే.. మరిన్ని నగరాల్లోకి ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్.. మీ సిటీలో 5G వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు!

* ఢిల్లీ
* సిలిగురి
* బెంగళూరు
* హైదరాబాద్
* వారణాసి
* ముంబై

5G Service Available in 50 Indian Cities And Towns _ Check Full List of Cities Here

5G Service Available in 50 Indian Cities And Towns _ Check Full List of Cities Here

* నాగ్‌పూర్
* చెన్నై
* గురుగ్రామ్
* పానిపట్
* గౌహతి
* పాట్నా

ఎయిర్‌టెల్ 5G ప్లస్ (Airtel 5G Plus) బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, పూణేలోని లోహెగావ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంతో సహా వివిధ విమానాశ్రయాలలో కూడా అందుబాటులో ఉంది.

Reliance Jio 5G ఉన్న నగరాల జాబితా ఇదే :
జియో 5G సర్వీసులు అందుబాటులో ఉన్న నగరాల్లో..

* ఢిల్లీ NCR
* ముంబై
* వారణాసి
* కోల్‌కతా
* బెంగళూరు
* హైదరాబాద్

5G Service Available in 50 Indian Cities And Towns _ Check Full List of Cities Here

5G Service Available in 50 Indian Cities And Towns _ Check Full List of Cities Here

* చెన్నై
* నాథద్వారా
* పూణే
* గురుగ్రామ్
* నోయిడా
* ఘజియాబాద్
* ఫరీదాబాద్
* గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోనూ Jio 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా, భారత మార్కెట్లో 5G సర్వీసులను కేవలం రెండు టెలికాం ఆపరేటర్లలో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) అందిస్తున్నాయి. Jio, Airtel రెండూ 2024 నాటికి 5G పాన్ ఇండియాను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని జియో కూడా డిసెంబర్ 2023 నాటికి ముఖ్యమైన భారతీయ నగరాలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు, Vodafone Idea (Vi) లేదా BSNLతో సహా ఇతర టెలికాం ఆపరేటర్లు తమ 5G సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు. BSNL 2023 ప్రారంభంలో 4G సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో లేదా చివరి నాటికి 5Gని ప్రారంభించాలని యోచిస్తోంది. కానీ, వోడాఫోన్ ఐడియా (Vi) ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. భారత మార్కెట్లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio True 5G Services : దేశ రాజధానిలో ఫ్రీగా జియో ట్రూ 5G సర్వీసులు.. ఢిల్లీ NCRలో జియోనే ఫస్ట్ 5G నెట్‌వర్క్.. మీ ఫోన్‌లో ఇలా 5G యాక్టివేట్ చేసుకోవచ్చు!