5G Services in India : దేశంలో ఫస్ట్ ఈ 13 నగరాల్లోనే 5G సర్వీసులు.. మీ సిటీకి ఎప్పుడు 5G వస్తుందో చెక్ చేసుకోండిలా!

5G Services in India : భారత్‌లో 5G నెట్‌వర్క్ ప్రారంభమైంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5G సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత మార్కెట్లో 5G సేవలను ప్రారంభించారు.

5G Services in India : దేశంలో ఫస్ట్ ఈ 13 నగరాల్లోనే 5G సర్వీసులు.. మీ సిటీకి ఎప్పుడు 5G వస్తుందో చెక్ చేసుకోండిలా!

5G will be available in these 13 cities first _ check when your city will get 5G

5G Services in India : భారత్‌లో 5G నెట్‌వర్క్ ప్రారంభమైంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5G సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత మార్కెట్లో 5G సేవలను ప్రారంభించారు. దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel)తో సహా టెలికాం ఆపరేటర్లు తమ 5G టెక్నాలజీని ప్రారంభించారు.

ఇప్పుడు, 5G సర్వీసులు ఈ రోజు దేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి 5G సర్వీసులు 2023 చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు, రిలయన్స్ జియో (Reliance Jio) ఈ సంవత్సరం దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైతో సహా 4 నగరాలకు జియో 5G సర్వీసులను చేస్తామని ఇప్పటికే ధృవీకరించింది. అయితే ఈ నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరూ Reliane Jio, Airtel నుంచి 5G సర్వీసులను పొందే అవకాశం ఉంది.

5G will be available in these 13 cities first _ check when your city will get 5G

5G will be available in these 13 cities first _ check when your city will get 5G

టెలికాం ఆపరేటర్లు 4 నగరాల్లోని నిర్దిష్ట ప్రాంతాల్లో 5G సర్వీసులను అందించాలని భావిస్తున్నారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) భారత్‌లో 5G అధికారిక లాంచ్‌కు ముందు ఢిల్లీలోని T3 ఎయిర్‌పోర్ట్‌లో 5G సర్వీసులను ఇప్పటికే ప్రకటించింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి ప్రయాణించే ప్రయాణికులు త్వరలో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని DIAL అధికారిక ప్రకటనలో తెలిపింది. విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న Wi-Fi సిస్టమ్ కన్నా 5G నెట్‌వర్క్ 20 రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌ను అందిస్తుందని అథారిటీ తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ముందుగా 13 నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇంతకీ ఈ 13 నగరాలేంటో ఓసారి లుక్కేయండి.

* ఢిల్లీ
* కోల్‌కతా
* చెన్నై
* ముంబయి
* అహ్మదాబాద్
* బెంగళూరు
* చండీగఢ్
* గాంధీనగర్
* గురుగ్రామ్
* హైదరాబాద్
* జామ్‌నగర్
* లక్నో
* పూణె

5G will be available in these 13 cities first _ check when your city will get 5G

5G will be available in these 13 cities first _ check when your city will get 5G

రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) భారత మార్కెట్లో మొదట 5G సర్వీసులను లాంచ్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత Vodafone-idea (Vi) 5G సర్వీసులను టెస్టింగ్ చేస్తోంది. వోడాఫోన్ 5G సర్వీసులను తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.

Airtel, Jio రెండూ 2023 చివరి నాటికి భారత్‌లోని అన్ని ప్రాంతాలలో అధికారికంగా 5G సర్వీసులను లాంచ్ చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రారంభంలో Jio, Airtel 5G సర్వీసులు దీపావళి నాటికి ప్రారంభమవుతాయి. కానీ, ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5G సర్వీసులు అందుబాటులో రానున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services : భారత్‌లో ఆ 8 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి!