Car Number Plates : ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ల కోసం లక్షలు తగలేశారు..

కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్లు అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నచ్చిన నెంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు.

Car Number Plates : ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ల కోసం లక్షలు తగలేశారు..

Expensive Car Number Plates

Expensive car number plates : కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్లు అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నచ్చిన నెంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ఆర్టీఓలో కూడా నచ్చిన నెంబర్ ప్లేట్ ఎంచుకునేందుకు అవకాశం ఉంది. భారతదేశంలో రిజిస్ట్రేషన్ ప్లేట్లు పూర్తిగా కస్టమైజ్ చేయలేము. ఎందుకంటే.. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను సింగిల్, డబుల్ డిజిట్ నెంబర్లతో వేలం వేస్తుంటుంది. నెంబర్ ప్లేట్లను బట్టి అదృష్టంగా భావించడం.. దేశంలో మూఢంగా నమ్మేవారు ఎక్కువ. అందుకే ఆర్టీఓ బిజినెస్ పరంగా ఎక్కువ డిమాండ్ రిజిస్ట్రేషన్ ప్లేట్లపైనే ఉంటుంది. అలాంటిది భారతదేశంలో బ్రాండింగ్ కొత్త కార్లలో ఖరీదైన నెంబర్ ప్లేట్లు కలిగిన కొన్నింటిని ఓసారి చూద్దాం..

Toyota Fortuner : రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ రూ. 34 లక్షలు :

Cat

జేమ్స్ బాండ్ ఫ్యాన్.. అషిక్ పటేల్.. ఇతని కారు రిజిస్ట్రేషన్ ప్లేట్ నెంబర్ 007. తన కొత్త టయోటా ఫార్చునర్ కారుకు నెంబర్ ప్లేట్ కోసం రూ.34 లక్షలు వెచ్చించాడు. ఫార్చునర్ కారు ధర రూ.30 లక్షలు.. నెంబర్ ప్లేట్ ఖరీదు మాత్రం అంతకంటే నాలుగు లక్షలు ఎక్కువగా పెట్టాడు. కారు కంటే నెంబర్ ప్లేట్ ఖరీదు చాలా ఎక్కువ అనమాట.

Porsche 718 Boxster : రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ రూ. 31 లక్షలు :

Car

కేరళకు చెందిన కేఎస్. బాలగోపాల్. Porsche 718 బాక్సస్టర్ కారుకు అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్.. KL01CK0001.. ఈ నెంబర్ ప్లేట్ ధర రూ.31 లక్షలు. 718 బాక్సస్టర్ కారును బాలగోపాల్ రూ.90 లక్షలు (ఎక్స్ షోరూం) పెట్టి కొన్నాడు. ఈ నెంబర్ ప్లేట్ ఖరీదు.. కొన్న కారు ఖరీదులో మూడో వంతు ఎక్కువగా ఉంటుంది.

Toyota Land Cruiser LC200 : రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ రూ. 18 లక్షలు :

Cars

బాలగోపాల్ గ్యారేజీలో మరో ఖరీదైన కారు LC200 ల్యాండ్ క్రూయిజర్.. ఈ కారు కోసం ఒకే 001 రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నాడు. ఈ నెంబర్ ప్లేట్ కోసం వేలంలో బాలగోపాల్ రూ.18 లక్షలు పెట్టి కొన్నాడు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ‘KL 01 CB 0001’ ధర ఎక్స్ షోరూంతో రూ.1 కోటి వరకు వెచ్చించాడు. తనకు ఉన్న ఈ రెండు కార్లకు ఒకే నెంబర్ ప్లేట్ తీసుకున్నాడు.

Toyota Land Cruiser LC200 : రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ రూ. 17 లక్షలు :

Ch

భారతదేశంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ కలిగిన ఓనర్లలో చండీఘడ్‌కు చెందిన జగ్జిత్ సింగ్ మూడో వ్యక్తి. తన టయోటా ల్యాండ్ క్రూయిజర్ CH 01 AN 0001 నెంబర్ ప్లేట్ ను వేలంలో కొనుగోలు చేశారు. తన గ్యారేజీలో ఖరీదైన కార్లలో ల్యాండ్ క్రూయిజర్ బ్లాక్ కలర్ ఒకటి.. ఇదొకటే కాదు.. చాలా హైఎండ్ కార్లకు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ 0001 ప్లేట్లను కలిగి ఉన్నారు. అయితే ఈ నెంబర్ ప్లేట్ల ధర ఎంతో రివీల్ చేయలేదు.

Jaguar XJ L : రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ రూ. 16 లక్షలు :

Rj
అత్యంత ఖరీదైన కార్ల యజమానుల్లో రాహుల్ తనేజా ఒకరు. ఆటో రిక్షా డ్రైవర్ గా మొదలైన తన కెరీర్.. సొంత కారు కొనే స్థితికి చేరుకున్నారు. కారు నెంబర్ ప్లేట్ కోసం రూ.40 లక్షలు పోసి కొన్నాడు. వాస్తవానికి ఈ నెంబర్ ప్లేట్ విలువ రూ.16 లక్షలు ఉంది. జైపూర్ లో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లలో ఇదొకటిగా జైపూర్ ఆర్టీఓ ప్రకటించింది.

BMW 5-Series : రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ రూ. 10.3 లక్షలు :

Cp

రాహుల్ తనేజా కు బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. ఈ కారుకు నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా రూ.10.31 లక్షలు వెచ్చించాడు. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా 1తోనే ఎండ్ అవుతుంది. న్యూమారాలజీపై ఈయనకు నమ్మకం ఎక్కువ. తన లక్కీ నెంబర్ కూడా 1. తన బీఎండబ్ల్యూ 5 సిరీస్ అమ్మేసినప్పటికీ తన లక్కీ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ను 7 సిరీస్ కోసం ఉంచుకున్నాడు.